Yadadri : సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి.. ఆలయం వీడియో షేర్ చేసి మంత్రి కేటీఆర్

భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం ఆలయ పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Yadadri : సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి.. ఆలయం వీడియో షేర్ చేసి మంత్రి కేటీఆర్
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 24, 2021 | 7:46 PM

Yadadri temple video : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం ఆలయ పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నరసింహుడి క్షేత్రం భూతల స్వరంలా మారిపోయింది. కాగా, యాదాద్రి నరసింహ స్వామి ఆలయం పునర్‌నిర్మాణం తర్వాత ఎలా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్‌నిర్మాణం సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వంటి ఆధునిక ఆలయాలను నిర్మిస్తూనే.. మరోవైపు యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఐతే యాదాద్రిలో ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ మధ్య అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగుతాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే భక్తుల దర్శనానికి అనుమతించాలని భావిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 16న వసంత పంచమి, 18న రథ సప్తమి పర్వదినాలు ఉన్నాయి. ఆ ముహూర్తాల్లోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read Also… సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న హుస్సేన్ సాగర తీరం.. అలనాటి కళకు ఆధునిక రూపం ఇస్తున్న హెచ్‌ఎండీఏ