Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jathara 2022: మేడారం హుండిల తొలిరోజు కౌంటింగ్ పూర్తి.. జస్ట్ 65 హుండీల ఆదాయం ఎంతంటే..!

Medaram Jathara 2022: మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర హుండిల లెక్కింపు తొలిరోజు పూర్తయ్యింది. మొదటిరోజు 1కోటి 34లక్షల 60వేల రూపాయలు ఆదాయం వచ్చింది.

Medaram Jathara 2022: మేడారం హుండిల తొలిరోజు కౌంటింగ్ పూర్తి.. జస్ట్ 65 హుండీల ఆదాయం ఎంతంటే..!
Medaram Jatara 2022
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 23, 2022 | 10:19 PM

Medaram Jathara 2022: మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర హుండిల లెక్కింపు తొలిరోజు పూర్తయ్యింది. మొదటిరోజు 1కోటి 34లక్షల 60వేల రూపాయలు ఆదాయం వచ్చింది. మొదటిరోజు 65 హుండీల లెక్కింపు పూర్తిచేశారు అధికారులు. ఇదిలాఉంటే.. మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర హుండిల లెక్కింపు ఇవాళ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు జరిగే హుండీల లెక్కింపులో ఈసారి భారీగా ఆదాయం లభిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

కాగా, మేడారం హుండీల లెక్కింపు హనుమకొండలోని టిటిడి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన 497 హుండీలను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మద్య టీటీడీ కల్యాణమండపానికి తరలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు, ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. వారం రోజులపాటు జరిగే హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 వరకు కొనసాగుతుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

2020మేడారం జాతరలో 502 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 17లక్షల ఆదాయం 497 హుండీలు నిండాయి, వీటికితోడు ఈ హుండీలు కూడా ఉన్నాయి.. కచ్చితంగా గత జాతర ఆదాయం రికార్డు బ్రేక్ అవుతుందని మేడారం పూజారులు, దేవాలయశాఖ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read:

Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు

Andhra Pradesh: దెయ్యం పట్టిందంటూ బాలికను అర్ధరాత్రి గ్రామ శివారుకు తీసుకువెళ్లి.. గొయ్యి తవ్వి

Online Games: లూడో, పోకర్, రమ్మీ.. దేశంలో దుమ్ము రేపుతున్న ఆన్‌లైన్ ఆటలు.. గేమింగ్ ముసుగులో బెట్టింగ్ మాఫియా..