AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు

Watermelon: సమ్మర్‌ సీజన్‌ వచ్చేస్తోంది. పుచ్చకాయకు భలే డిమాండ్‌ ఉంటుంది. ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువగా తీసుకుంటే..

Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు
Subhash Goud
|

Updated on: Feb 23, 2022 | 10:14 PM

Share

Watermelon: సమ్మర్‌ సీజన్‌ వచ్చేస్తోంది. పుచ్చకాయకు భలే డిమాండ్‌ ఉంటుంది. ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట. మన శరీరం (Body)లో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఎండాకాలం (Summer)లో పుచ్చపండు (Watermelon) తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మన శరీరంలో వాటర్‌ లెవెల్స్‌ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్‌ (Dehydration)స్టేజిలోకి వెళ్లిపోతుంటాం. అలాంటి సమయంలో వడ దెబ్బ తగిలి కళ్లు తిరిగి కిందపడిపోతుంటారు. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే శరీరంలో వాటర్‌ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్‌, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్‌, విటమిన్‌-ఏ, విటమిన్‌ -బీ6, విటమిన్‌-సి తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పుచ్చకాయ వల్ల కలిగే లాభాలు:

► పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది.

► మధుమేహం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.

► క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలు ఉంది.

► గర్భిణీ మహిళలకు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.

► కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెలో కలిపి పుచ్చకాయ తింటే ఎంతో మంచిది.

► డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.

► ఎండ వల్ల వచ్చే దద్దుర్లను తగ్గిస్తుంది.

► బీపీని కంట్రోల్ చేస్తుంది.

► రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.

► శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.

► నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది.

► మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

► ఒత్తిడిని తగ్గిస్తుంది .

► కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది.

► కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.

ఇవి కూడా చదవండి:

Hypothyroid: మీకు హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాలను తీసుకోండి

Corona Effect: గుండె రక్తనాళాలపై కరోనా ఎఫెక్ట్‌.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు