Andhra Pradesh: దెయ్యం పట్టిందంటూ బాలికను అర్ధరాత్రి గ్రామ శివారుకు తీసుకువెళ్లి.. గొయ్యి తవ్వి

AP News: ప్రపంచమంతా 5జి అంటూ సాంకేతికంగా ఉరుకులు, పరుగులు పెడుతుంటే ఇలాంటి గ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మంత్రగాళ్లు తమ పబ్బం గడుపుకునేందుకు దెయ్యాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. 

Andhra Pradesh: దెయ్యం పట్టిందంటూ బాలికను అర్ధరాత్రి గ్రామ శివారుకు తీసుకువెళ్లి.. గొయ్యి తవ్వి
Witchcraft
Follow us

|

Updated on: Feb 23, 2022 | 10:03 PM

Prakasam District: మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..? ముగ్గులు వేసి పసుకు, కుంకుమ పెట్టి నిమ్మకాయలు కోస్తే దెబ్బకు దెయ్యం పారిపోతుందా..? ఆ గ్రామంలో దెయ్యం పట్టిందని అనుమానం వస్తే అలాగే చేస్తారట… దెయ్యం వదిలిస్తామంటున్న భూతవైద్యుల నిర్వాకం తాజాగా వెలుగుచూసింది.  శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ది చెందుతున్న గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. దెయ్యం వదిలిస్తామంటూ, గాలి పట్టిందంటూ అక్కడక్కడ భూతవైద్యులు పబ్బం గడుపుకుంటున్నారు. అమాయక ప్రజల భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. పదిహేనేళ్ల బాలికకు దెయ్యం(Ghost) పట్టిందంటూ భూతవైద్యులు ఆమెను అర్దరాత్రి గ్రామ శివారులో తీసుకెళ్లి ముగ్గులు వేసి నానా హంగామా చేశారు. భూతవైద్యం పేరిట గ్రామంలో భయాందోళనలు కలిగించారు ఈ సంఘటనపై స్థానికులు ఎవరూ నోరు మెదపడం లేదు. అదేమంటే ఎవరి నమ్మకాలు వారివంటూ సమర్ధించుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గొర్రే పాడులో అంకమ్మ తల్లి దేవాలయం ఉంది.  ఈ దేవాలయంలో కొంతమంది భూతవైద్యం పేరిట హల్‌చల్‌ చేస్తున్నారు. మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పడే కుటుంబాలను గుర్తించి వారికి గాలి సోకిందని, దెయ్యం పట్టిందని నమ్మించి గుళ్లో పూజల పేరుతో రప్పిస్తున్నారు. డప్పు మేళాల మధ్య పూనకం వచ్చినట్టు ఊగిపోతూ నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పదిహేనేళ్ల బాలిక కొంతకాంలగా అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు దెయ్యం పట్టిందని నమ్మించి అంకమ్మతల్లి దేవాలయంలో పూనకాలతో ప్రత్యేక పూజలు చేశారు. అంతవరకు బాగానే ఉంది… ఈ పూజలు సరిపోవంటూ బాలికను తీసుకుని అర్ధరాత్రి గ్రామ శివారులో నానా హంగామా చేశారు. భయంకర ఆకృతులతో ముగ్గులు వేశారు. పసుపు, కుంకుమ చల్లారు..నిమ్మకాయలు ఉంచారు. బాలికను నేలపై కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా రెండడుగుల గొయ్యి తవ్వారు.. ఆగొయ్యిలో నిప్పు రాజేశారు. గొయ్యికి మరోపక్క కర్పూరంతో మంట పెట్టారు. ఏవేవో నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ ఆమెతో గొయ్యిలోని మంటకు దండం పెట్టించి నిమ్మకాయలు కోసి ఏదో దెయ్యాన్ని వదిలిస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చారు. భూతవైద్యుడి బిల్డప్‌కు అక్కడ ఉన్నవారంతా చేతులు ఎత్తి మొక్కుతూ భయం భయంగా గడిపారు. చివరకు దెయ్యం వదిలింది పొమ్మంటూ బాలిక బంధువుల దగ్గర డబ్బులు దండుకుని పంపించారు.

ప్రపంచమంతా 5జి అంటూ సాంకేతికంగా ఉరుకులు, పరుగులు పెడుతుంటే ఇలాంటి గ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మంత్రగాళ్లు తమ పబ్బం గడుపుకునేందుకు దెయ్యాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు.  ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు బాలిక తల్లిదండ్రులు, దేవాలయం నిర్వాహకులు నిరాకరిస్తున్నారు.

Also Read: Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు

కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

Latest Articles