Online Games: లూడో, పోకర్, రమ్మీ.. దేశంలో దుమ్ము రేపుతున్న ఆన్‌లైన్ ఆటలు.. గేమింగ్ ముసుగులో బెట్టింగ్ మాఫియా..

ఐదు రూపాయలు పెట్టండి ఐదు వేలు పట్టండి. నేను ఈ గేమ్ ఆడుతున్నాను. నా అకౌంట్ చూడండీ వేల రూపాయలతో ఎలా నిండిపోతుందో. ఇదీ ఆన్ లైన్ గేమ్ యాప్స్ కి సంబంధించిన యాడ్ల వెల్లువ. ఇపుడంతా ఆన్ లైన్ గేమింగ్ యాప్..

Online Games: లూడో, పోకర్, రమ్మీ.. దేశంలో దుమ్ము రేపుతున్న ఆన్‌లైన్ ఆటలు.. గేమింగ్ ముసుగులో బెట్టింగ్ మాఫియా..
Online Gaming Danda
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2022 | 9:53 PM

ఐదు రూపాయలు పెట్టండి ఐదు వేలు పట్టండి. నేను ఈ గేమ్ ఆడుతున్నాను. నా అకౌంట్ చూడండీ వేల రూపాయలతో ఎలా నిండిపోతుందో. ఇదీ ఆన్ లైన్ గేమ్ యాప్స్ కి(Online Games)సంబంధించిన యాడ్ల వెల్లువ. ఇపుడంతా ఆన్ లైన్ గేమింగ్ యాప్ జమానా. ఎక్కడ చూసినా ఆన్ లైన్ గేమ్స్ కి సంబంధించిన ప్రకటనలే. ఇంతకీ ఏంటీ ఆన్ లైన్ యాప్స్. వాటి డీటైల్స్ ఏంటి? వీటినెలా ఆపరేట్ చేస్తారు. దేశంలో విస్తరిస్తున్న వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఆన్ లైన్ గేమింగ్ దందాయే. సాధారణంగా ఈ గేమ్స్ రెండు రకాలు. వీటిలో మొదటిది పూర్తి టాలెంట్ కి సంబంధించినది కాగా. రెండోది పూర్తి లక్ ఆధారంగా సాగే.. గేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లూడో, పోకర్, రమ్మీ వంటివి.  ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు మూడు రకాలుగా సర్య్యులేట్ అవుతుంది. అదెలాగంటే.. ఆన్ లైన్ గేమ్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం. దీనిపై ఆయా కంపెనీలు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాయి.

ఆ తర్వాత ప్రైజ్ మని పూల్ చేస్తారు.. అంటే గేమ్ లో పాల్గొనే వ్యక్తులు కొంత మొత్తంలో డబ్బును జమ చేస్తారన్నమాట. గెలిచిన వారు ఈ మొత్తాన్ని తీసుకుంటారు. ఇది పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆన్ లైన్ గేమ్స్ ఆడే సమయంలో పలు కంపెనీల ప్రకటనలు గుప్పిస్తాయి. ఈ ప్రకటనల నుంచి వచ్చే ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను ఆదాయం లభిస్తుంది.

ఇంటర్నెట్ వాడే వారిలో 40శాతం మంది ఆన్ లైన్ జూదం ఆడుతున్నట్టు చెబుతున్నాయి లెక్కలు. కరోనా కాలంలో ఆన్ లైన్ గేమింగ్ ఆడేవారి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా… గేమింగ్ ముసుగులో ఆన్ లైన్ కంపెనీలు బెట్టింగ్ కల్చర్ ను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మొబైల్ పుణ్యమాని ఈ జూద సంస్కృతి మరింత విస్తృతమైందని అంటున్నారు నిపుణులు.

దేశంలో ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో 30 లక్షలకు పైగా ఆప్స్ ఉన్నాయి. ఇందులో ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ఏకంగా 4, 44, 226 ఉన్నాయి. ఈ గేమింగ్ ఆప్స్ లో భారత్ లో అభివృద్ధి చేసిన యాప్ ల సంఖ్య 19, 632. 2018 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య రూ. 26. 90 కోట్లుగా ఉంది. 2020కి ఈ సంఖ్య రూ. 36. 50 కోట్లకు పెరిగింది. 2022 నాటికి దేశంలో ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య 51 కోట్లకు చేరుతుందని ఒక అంచనా. మన దేశంలో 2021 నాటికి- 400 పైగా గేమింగ్‌ కంపెనీలు పనిచేస్తున్నట్టు చెబుతున్నాయి లెక్కలు. ఇందులో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌, హైపర్‌ లింక్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, ఎఫ్‌జీ ఫ్యాక్టరీ, జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థలున్నాయి.

ఇక ఈ గేమింగ్ మార్కెట్ ఎంతగా విస్తరించిందంటే. 2016 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ బజార్ 4వేల కోట్ల మార్కెట్ విస్తరణ చేయగా.. 2021 నాటికి ఆన్ లైన్ గేమింగ్ విలువ 7 వేల 500 కోట్లకు పెరిగింది. ఏటా ఆన్ లైన్ గేమింగ్ మార్కెట్ 18 శాతానికి పెరిగింది. 2023 నాటికి దేశంలో ఆన్ లైన్ గేమింగ్ మార్కెట్ 15 వేల కోట్లకు చేరుతుందని ఒక అంచనా. గేమర్ల విషయానికి వస్తే.. 2020 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య 36 కోట్లు- 2022 నాటికి భారత్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య 51 కోట్లకు చేరుతుందని ఒక ఎస్టిమేషన్.

ఇవి కూడా చదవండి: Chicken Changezi Recipe: చికెన్ ఇలా వండితే.. మొత్తం మీరే తినేస్తారు.. ఎలా చేయాలో నేర్చుకోండి..

Viral Video: కచోడీ కొనేందుకు ట్రైన్​ఆపిన డ్రైవర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!