విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నుంచి వేల కోట్లు కట్టించాం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ
బ్యాంకులను మోసం (bank fraud) చేసి పరారీలో ఉన్న మోసగాళ్ల నుంచి ప్రతి పైసా రికవరీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బ్యాంకులను మోసం చేసి పరారీలో..
బ్యాంకులను మోసం (bank fraud) చేసి పరారీలో ఉన్న మోసగాళ్ల నుంచి ప్రతి పైసా రికవరీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బ్యాంకులను మోసం చేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యా(Vijay Mallya) , నీరవ్ మోడీ(nirav modi), మెహుల్ చోక్సీ(Mehul Choksi) నుంచి ఇప్పటివరకు రూ.18,000 కోట్లను రికవరీ చేసినట్లుగా వెల్లండించారు. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మెహతా మాట్లాడుతూ పిఎంఎల్‌ఎ కింద కోర్టు జారీ చేసిన ఆదేశం ప్రకారం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీల కేసుల్లో ఇప్పటివరకు రూ.18,000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. డిసెంబరులోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై నాటికి బ్యాంకులు మూడు కేసులలో తమ ఆస్తులను విక్రయించడం ద్వారా రూ. 13,109 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయని తెలియజేశారు. తాజా రికవరీలో బ్యాంకులు రూ.792 కోట్లు వెనక్కి తీసుకున్నాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఎస్సీ ముందు పెండింగ్ లో ఉణ్న PMLA కేసుల్లోని నేరాల్లో మొత్తం రూ. 67 వేల కోట్లు ఉన్నట్లు అంచనా. నేరాలను దర్యాప్తు చేయడం, స్వాధీనం చేసుకోవడం, అటాచ్ మెంట్ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు విస్తృత అధికారాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరికి సంబంధించ ఆస్తులను గతంలో ఈడీ సీజ్ చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA)కింద ఈ ముగ్గురికి సంబంధించి రూ. 18,170.02 కోట్లను ఈడీ గతంలో సీజ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ 80.45 శాతంగా ఉంది. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Chicken Changezi Recipe: చికెన్ ఇలా వండితే.. మొత్తం మీరే తినేస్తారు.. ఎలా చేయాలో నేర్చుకోండి..