Hanuman Jayanti: ఉజ్జయినిలో హనుమాన్ జయంతి రోజున భారీ విందు.. 50వేల మందికి ప్రసాద వితరణ..
హనుమాన్ జయంతి పండగను దేశమంతా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు సృష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ బాబా జై వీర హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించడానికి దాదాపు 50,000 మంది భక్తులు ఆలయానికి చేరుకోనున్నారు. భక్తులకు ప్రసాద వితరణ బఫే కాకుండా.. బంతి(బల్లలు, కుర్చీలు) భోజనాలుగా హనుమాన్ ప్రసాదం వితరణ చేయనున్నారు. ఆదివారం రాత్రి మహా హారతి తర్వాత హనుమంతుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఈ భండారా ప్రారంభమవుతుంది.

అన్ని కాలాలకు అధిపతి అయిన బాబా మహాకాల్ నగరమైన ఉజ్జయినిలో రోజు పండగ వాతావరణం ఉంటుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే వివిధ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి నగరంలోనే కాదు.. మొత్తం దేశంలోనే వార్తలుగా నిలుస్తాయి. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా రేపు (ఆదివారం) సాయంత్రం ఉజ్జయినిలో గొప్ప భండారా(గొప్ప విందు భోజనం లేదా ప్రసాద వితరణ కార్యక్రమం) నిర్వహించనున్నారు. ఇది మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద భండారా అని అంటున్నారు. నిర్వాహక కమిటీ ఈ విందుకు నాగర్ భోజ్ (నగర విందు) అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ విందులో దాదాపు 50,000 మంది భక్తులు బాబా జై వీర హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆలయానికి చేరుకోనున్నారు.
ఈ ఏడాది హనుమాన్ జయంతి వేడుకలను కొంతమంది ఈ రోజు జరుపుకుంటున్నారు. మరికొందరు రేపు(ఏప్రిల్ 13న) జరుపుకోనున్నారు. ఈ నేపద్యంలో అంబపురలోని పురాతన జైవీర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతిని ఏప్రిల్ 13న ఘనంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు, మహా ఆరతి నిర్వహిస్తారు. దీని తరువాత నగర విందు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త సునీల్ చావంద్ మాట్లాడుతూ తనకు హనుమంతుడి పట్ల అపార భక్తి ఉందని చెప్పారు. అందుకే మేము గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు.
హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోవడం మొదలు పెట్టిన సమయంలో ఈ కార్యక్రమాన్ని ఊరేగింపు రూపంలో నిర్వహించేవారమని ఆయన చెప్పారు. కలాక్రమంలో ఈ 10 సంవత్సరాలలో ఈ కార్యక్రమం చాలా పెద్దదిగా మారింది. ఇప్పుడు వేలాది మంది భక్తులు బాబా జై వీర హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఈ నగర విందుకు చేరుకుంటారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ… గత 15 రోజులుగా భక్తులు, స్నేహితుల బృందంలోని వారందరూ ఈ కార్యక్రమం విజయవంతం కోసం కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఈ నగర విందు కార్యక్రమం నగరంలో జరిగే ఇతర భండార్ల లాంటిది కాదని చెప్పారు. ఎందుకంటే ఈ విందులో పాల్గొనే ప్రతి భక్తుడిని ఒక టేబుల్, కుర్చీపై కూర్చోబెట్టి దాల్ బఫ్లా , లడ్డూ ప్రసాదాన్ని వడ్డిస్తారు. ఈ కారణంగానే ఈ నగర ఉత్సవంలో పాల్గొనే భక్తుల సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతోంది.
గోల్డెన్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు ?
అంబాపుర దేశాయ్ నగర్‌లో నిర్వహించే ఈ నగర విందులో పాల్గొనే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది., అందుకే ఈ సంవత్సరం నిర్వాహక కమిటీ ఈ బృందాన్ని గోల్డెన్ వరల్డ్ రికార్డ్‌గా పేర్కొంది. ఈ సంవత్సరం, 50,000 మందికి పైగా భక్తులు భండార్ వద్ద హనుమాన్ ప్రసాదాన్ని అందుకోనున్నారు. ఈ బృందం ఆదివారం ప్రపంచ రికార్డును సృష్టించనుంది.
నగర విందు కోసం ప్రసాదం సిద్ధం చేస్తున్న 60 మంది మిఠాయి తయారీదారులురు.
ఆదివారం రాత్రి మహాహారతి తర్వాత హనుమంతుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఈ భండారా ప్రారంభమవుతుంది. భండారాలో పంచేందుకు దాల్, బఫ్లా, లడ్డూలు తయారు చేయబడతాయి. దీని కోసం, దాదాపు 75 క్వింటాళ్ల పిండి, 400 కిలోల స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తున్నారు.
భండారా కోసం 60 మంది వంటవారు ఆహారాన్ని తయారు చేస్తారని, 600 మంది కార్మికులు ఆహారాన్ని అందించే ఏర్పాట్లను చూసుకుంటారని నిర్వాహకుడు సునీల్ చావంద్ తెలిపారు. ప్రతిసారీ లాగే, ఈసారి కూడా భక్తులను టేబుల్ వద్ద కూర్చోబెట్టి వారికి ఆహారం వడ్డిస్తారు. పురుషులు, మహిళలకు వేర్వేరు సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. భండారా కోసం ఆహార ప్రసాదం తయారీ ఈ రాత్రి నుండే ప్రారంభమైంది.
మేము గత 10 సంవత్సరాలుగా భండార్ కోసం వంటగదిని సిద్ధం చేస్తున్నామని చెప్పారు: ఈ భారీ విందును తయారుచేసిన ప్రత్యేక వ్యక్తి ఉజ్జయిని మిఠాయి తయారీదారు ప్రకాష్ చావంద్. ఆయన వద్ద 60 మంది మిఠాయి తయారీదారులు.. 30 మంది కళాకారుల బృందం ఉంది. వారు ప్రతి సంవత్సరం ఈ భారీ విందు బాధ్యతను తీసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..