AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశులకు ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడమే ఇష్టం.. ప్రయాణాలు అంటే ఇష్టపడే రాశులు ఏమిటో తెలుసా..

మనిషికి జరిగే మంచి చెడులను మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని, అభిరులను కూడా జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చట. పుట్టిన రెడీ, రాశి, నక్షత్రం వంటి సహాయంతో మనిషి జీవితానికి సంబందించిన అనేక విషయాలు తెలుసుకోవచ్చట. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వ్యక్తికీ నచ్చే పనులు.. నచ్చనివి కూడా తెలుసుకోవచ్చట. అదే విధంగా ఏ మాత్రం సమయం దొరికినా ఇంట్లో ఉండకుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడే రాశులు ఉన్నాయట. అప్పటి వరకూ వద్దు అన్నవారు కూడా ట్రావెలింగ్ అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తారట. ప్రయాణాలు చేయడం అంటే పిచ్చి ఉన్న రాశులు ఏమిటో తెలుసుకుందాం..

ఈ రాశులకు ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడమే ఇష్టం.. ప్రయాణాలు అంటే ఇష్టపడే రాశులు ఏమిటో తెలుసా..
Travel Loving Zodiac Signs
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2025 | 3:38 PM

మనిషి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని వారు పుట్టిన రాశి లేదా నామ నక్షత్రాల ద్వారా తెలుసుకోవచ్చని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. మనుషుల జాతకంలో గ్రహాలు, నక్షత్రాల స్థానాన్ని బట్టి వ్యక్తిత్వం, స్వభావం మాత్రమే కాదు ఇష్టా అయిష్టలను గురించి కూడా అంచనా వేయవచ్చు అని అంటున్నారు పండితులు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండాలంటే కాలు నిలవని రాశులు కొన్ని ఉన్నాయట. వీరు ఏ మాత్రం సమయం దొరికినా ప్రపంచాన్ని చుట్టేదాం అని ఎదురు చూస్తారట. ప్రయాణాలు చేయడం అంటే పిచ్చిగా ఇష్టపడే రాశులేంటో చూద్దామా…

ధనుస్సు రాశి: కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ సరికొత్త అనుభవాలను ఇష్టపడతారు వీరు. సాహసయాత్ర అంటే వీరికి అత్యంత ఇష్టం. పర్వతాల గుండా ట్రెక్కింగ్ అయినా లేదా అన్యదేశ సంస్కృతులలోకి ప్రవేశించి.. సరి కొత్త అనుభవాలను పొందాలనుకుంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రయాణంలో ఓదార్పు పొందుతారు.

మిథున రాశి: బహుముఖ ప్రజ్ఞాశాలిలైన మిథున రాశి వారు విభిన్న సంస్కృతితో కూడిన కొత్త వాతావరణాలను అన్వేషించే ఆసక్తిని కలిగి ఉన్నారు. వీరికి జిజ్ఞాస ఎక్కువ. జ్ఞాన సంపాదన కోసం అవిశ్రాంతమైన కోరికతో ముందుకు సాగుతారు. నగర ప్రకృతి దృశ్యాల నుంచి గ్రామీణ ప్రశాంతత వరకు ఎటువంటి వాతావరణంలోనైనా మిథున రాశి వారు అడ్జెస్ట్ అయి ప్రయాణం చేస్తారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రయాణం అంటే చాలు సిద్ధంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: అసాధారణ స్ఫూర్తితో .. సామాజిక నిబంధనలను సవాలు చేయాలనే కోరికని కుంభ రాశి వారు కలిగి ఉంటారు. విభిన్న జాతుల జీవనశైలిని అర్థం చేసుకోవడానికి , సంస్కృతుల గురించి జ్ఞానాన్ని పొందడానికి ప్రయాణం చేయడం వీరికి అత్యంత ఇష్టం. వీరు చేసే ప్రయాణాలు స్థానికులతో సంబంధాలను ఏర్పరచుకుంటూ వ్యక్తిగతంగా వృద్ధిని ప్రేరేపించేవిగా ఉంటాయి.

మేషరాశి: వీరి స్వభావం అకస్మాత్తుగా నిర్ణయాలను తీసుకునే స్వభావం. కనుక హఠాత్తుగా ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతారు. మేషరాశికి చెందిన వ్యక్తులు సహజంగా వివిధ ప్రదేశాల్లో అన్వేషణ చేయడానికి రెడీ అవుతారు. ధైర్యవంతులైన మేషరాశి వారు సాహసోపేతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. ఎవరూ వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళడానికి అక్కడ విభిన్నమైన అనుభవాలను పొందడానికి ఇష్టపడతారు.

సింహ రాశి: వీరి అత్యంత నాటకీయ నైపుణ్యం కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడే వీరు.. విలాసవంతమైన ప్రదేశాల్లో ప్రయాణించేందుకు ఇష్టపడతారు. అందమైన ఆకర్షనీయమైన ప్రదేశాలతో పాటు నగర జీవితానికి దూరంగా ప్రకృతి దగ్గరగా ప్రయాణించడం వీరికి ఇష్టం. అంతేకాదు ఇతర దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. బీచ్ లో ఎంజాయ్ చేయడం వీరికి అత్యంత ఇష్టమైన అభిరుచి.

తుల రాశి: సౌందర్యం పట్ల అభిరుచి ఉన్న తులారాశి వారు కళాత్మక ప్రేరణ, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలియజేసే ప్రదేశాలను పర్యటించడానికి ఇష్టపడతారు. వీరు ప్రయాణ సమయంలో సులభంగా ఇతరులతో కలిసి పోతారు. పురాతన చారిత్రక ప్రదేశాలను సందర్శించడం. చక్కటి రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం వంటి అనుభావలను ఈ రాశివారు కోరుకుంటారు.

మీన రాశి: అనంతమైన సృజనాత్మకత మీన రాశి వారి సొంతం. ఆధ్యాత్మిక యాత్రలను ఇష్టపడతారు. అంతేకాదు ప్రకృతి దృశ్యాలు వీరిని ఆకర్షిస్తాయి. సముద్రయానం అయినా వీరు ఇష్టపడతారు. వీరు తమ ఆలోచనలకు, సృజనాత్మక తను ఇచ్చే ప్రయాణాలను.. రోజువారీ జీవితానికి దూరంగా ఉండే ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.