Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన విశ్వంభర టీమ్.. రామ రామ సాంగ్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభర నుంచి హనుమాన్ జయంతి కానుకగా రామ.. రామ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విదులైన కొద్ది సేపటికే ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా తీజర్ రిలీజై మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా రిలీజైన సాంగ్ కు మంచి స్పందన లభించింది. హనుమంతుడి వైభవాన్ని తెలియజేస్తున్న ఈ సాంగ్ వింటున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర. సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయస్వామి శ్రీరాముడి భక్తుడు. కనుక ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది. శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ ‘రామ.. రామ..’ అనే పాటును విడుదల చేసి మోగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచి పాన్ ఇండియా స్థాయిలో మోత మోగుతుంది. హనుమంతుని వైభవాన్నీ తెలియజేస్తూ సాగిన సాంగ్ చాలా బాగుంది. రాములోరి గొప్ప చెప్పుకుందామా సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగిపోతూ ఆకట్టుకుంటోంది. ‘జై శ్రీరామ్’ అంటూ వచ్చిన చిరంజీవి వాయిస్ అదిరిపోయింది. ఫుల్ ఎనర్జీటిక్‌గా ఉన్న ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, కీరవాణి బాణీలు హైలైట్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై అంచనాలను పెంచేయగా.. తాజాగా రామ రామ సాంగ్ ని రిలీజ్ చేసి చిత్ర బృందం ఫ్యాన్ కు పండగ సందడిని మరింత పెంచేసింది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..