- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan Share BTS Photos From Good Bad Ugly Movie
Trisha Krishnan: ఈ పౌర్ణమి అందానికి చంద్రుడు కూడా చిన్నబోతాడేమో.. కాలాన్నీ సైతం బంధీ చేసిన త్రిష..
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. 41 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.
Updated on: Apr 12, 2025 | 2:04 PM

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. ముఖ్యంగా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంది ఈ వయ్యారి.

తాజాగా కోలీవుడ్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిష అందం, అభినయంతో మరోసారి వెండితెరపై మాయ చేసింది.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది త్రిష. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నుంచి BTS ఫోటోస్ అభిమానులతో పంచుకుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది త్రిష. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నుంచి BTS ఫోటోస్ అభిమానులతో పంచుకుంది.

తమిళంలో రెండు మూడు చిత్రాలతోపాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.





























