హ్యాపీ హ్యాపీగా.. సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న శ్రీలీల క్యూట్ ఫొటోస్!
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ చిన్నది, తాజాగా సోషల్ మీడియాలో తన క్యూట్ ఫొటోస్ తో రచ్చ చేస్తుంది. లైట్ పింక్ డ్రెస్ లో తన అందాలతో మాయ చేస్తుంది. మరి మీరు కూడా ఆఫొటోలపై ఓ లుక్ వేయండి.
Updated on: Apr 12, 2025 | 3:24 PM

పెళ్లి సందD సినిమాతో వెండితెరపైకి అడుకు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీలో తన నటన, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది తర్వాత తెలుగులో వరసగా ఛాన్స్ లు అందుకొని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత రవితేజ ధమాకా మూవీలో నటించి, ఈ సినిమాలో తన డ్యాన్స్, అందంతో కుర్రకారును తన వైపుకు లాక్కుంది. తర్వాత వరసగా సినిమాలు చేసినప్పటికీ, ఆ సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో శ్రీలీల క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

ఇక తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. బాలీవుడ్ , కోలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా పుష్ప2 సినిమాలో కిసక్కీ సినిమాతో మరోసారి తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది.

అంతే కాకుండా నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మరోసారి థియేటర్లో సందడి చేస్తుంది. కానీ ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సినిమా పరిస్థితి ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం అందంతో చంపేస్తుంది.

తాజాగా లైట్ పింక్ కలర్ డ్రెండీ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ చిన్నది చాలా సంతోషకంగా కనిపిస్తుంది. అయితే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ చిన్నదానికి మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుందంటున్నారు తన ఫ్యాన్స్.





























