- Telugu News Photo Gallery Cinema photos Aditi Shankar latest fabulous photos in saree goes viral in internet
Aditi Shankar: ఈమె స్పర్శ లేనిదే అందానికి కునుకైన రాదు.. ఫ్యాబులస్ అదితి..
అదితి శంకర్ హీరోయిన్, నేపథ్య గాయని ఎక్కువగా తమిళ చిత్రాలలో పని చేస్తుంది. తరుచూ సామజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులను ఖుషి చేస్తుంది ఈ వయ్యారి భామ. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు వీటికి లైక్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
Updated on: Apr 12, 2025 | 12:34 PM

6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత ఎస్. శంకర్ కుమార్తె. ఆమెకు ఒక అక్క, ఐశ్వర్య శంకర్ మరియు ఒక తమ్ముడు, అర్జిత్ శంకర్ కూడా ఉన్నారు.

అదితి శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్ గా సినిమాల వైపు అడుగులు వేసింది.

2022లో శివకార్తికేయన్ సరసన తమిళ మసాలా చిత్రం విరుమాన్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఈ వయ్యారి నటనకి ఉత్తమ తొలి నటిగా SIIMA అవార్డు గెలుచుకుంది. ఇది తెలుగులో మహావీరుడిగా విడుదలైంది.

2022లో వరుణ్ తేజ హీరోగా తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం గనిలో థమన్ మ్యూజిక్ అందించిన "రోమియో జూలియట్" అనే పాట ఆలపించింది. మహావీరుడు (డి) "బంగారుపేటలోన" అని మరో తెలుగు పాట పడింది.

భైరవం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది ఈ సుకుమారి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వన్స్ మోర్ అనే ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రీకరణ పూర్తయింది.





























