Temple Dress Code: అక్కడ దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్.. చిరిగిన జీన్స్, పొట్టి బట్టలతో వెళ్తే నో ఎంట్రీ..
ఇక నుంచి అసభ్యకరమైన, రెచ్చగొట్టే, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే విధంగా బట్టలు.. పొట్టి బట్టలు ధరించి ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు ఉండదు. ఇక నుంచి అటువంటి దుస్తులను ధరించి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయాల్లో ప్రవేశించడానికి అనుమతినివ్వరు. అయితే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ వ్యతిరేకించింది. కొద్ది రోజుల క్రితం తుల్జాభవానీ ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు చేశారు. రాజకీయ నేతల నిరసనలతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఇప్పటికే దక్షిణ భారత దేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. ఈ క్షేత్రాల్లో కొలువుదీరిన దైవాన్ని దర్శించుకోవాలంటే భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మరో రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజు నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మోడ్రన్ దుస్తులతో ఇక నుంచి ఆలయాలకు వెళ్లాలంటే ఆలోచించాల్సిందే..
మహారాష్ట్ర లోని ప్రముఖ పట్టణం నాగ్‌పూర్‌లోని 4 ప్రముఖ దేవాలయాల్లో నేటి (మే 27, శనివారం) నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 300 దేవాలయాలతో సహా నాగ్‌పూర్‌లోని 25 దేవాలయాల్లో క్రమంగా ఈ డ్రెస్ కోడ్ ను అమలు చేసే విధముగా చర్యలు తీసుకోనున్నట్లు మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ ప్రకటించింది. మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఇక నుంచి అసభ్యకరమైన, రెచ్చగొట్టే, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే విధంగా బట్టలు.. పొట్టి బట్టలు ధరించి ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు ఉండదు. ఇక నుంచి అటువంటి దుస్తులను ధరించి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయాల్లో ప్రవేశించడానికి అనుమతినివ్వరు.
అయితే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ వ్యతిరేకించింది. కొద్ది రోజుల క్రితం తుల్జాభవానీ ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు చేశారు. రాజకీయ నేతల నిరసనలతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఏఏ ఆలయాల్లో అమల్లోకి వచ్చిందంటే..
ఇప్పుడు మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ డ్రెస్ కోడ్ నిర్ణయం తీసుకోవడమే కాదు.. దీనిని పక్కాగా అమలు చేయాలనీ భావిస్తోంది.. ముందుగా నాగ్‌పూర్‌లోని 25 దేవాలయాలు, రాష్ట్రవ్యాప్తంగా 300 కి పైగా దేవాలయాలలో ఈ డ్రెస్ కోడ్‌ను అమలు చేయడానికి కృషి చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత క్రమంగా అన్ని ఆలయాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రస్తుతం, డ్రెస్ కోడ్ వర్తించే నాగపూర్‌లోని ధం తోలిలోని గోపాల్ కృష్ణ ఆలయం, బెలోరిలోని సంకట్ మోచన పంచముఖ హనుమాన్ ఆలయం, కొన్హోలిబారాలోని బృహస్పతి ఆలయం , హిల్‌టాప్‌లోని దుర్గామాత ఆలయం.
ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వ్రాయబడిన ప్రవేశ నియమాలు
ఈ ఆలయాల ప్రవేశ ద్వారం వద్ద స్త్రీలు,పురుషులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి రావాలి. అసహజమైన దుస్తులు అంటే.. శారీరక అవయవాలను బహిర్గతం చేసే, రెచ్చగొట్టే విధంగా ఉండే అసభ్యకరమైన దుస్తులు ధరించవద్దు. పొట్టి బట్టలు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్ట్, నైట్ సూట్, టోర్న్ జీన్స్ వంటివి వేసుకుని ఆలయంలోకి దైవ దర్శనానికి వద్దు. అటువంటివాటికి ప్రవేశం నిషేధం.. భక్తులు ఈ నిర్ణయానికి సహకరించగలరు అని కోరారు.
‘రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ డ్రెస్ కోడ్ వర్తిస్తుంది.. అలాంటప్పుడు దేవాలయాల్లో ఎందుకు వర్తించదు?’
ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయాల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేవాలయాలలో అసభ్యకరమైన బట్టలు, అదీ శరీరంలోని అవయవాలను బహిర్గతం చేసి విధంగా ధరించడం సరికాదన్నారు. అందుకే ఈ నిబంధన జారీ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కోడ్ నాగ్‌పూర్‌లోని నాలుగు దేవాలయాలలో అమలు చేయబడింది. సమీప భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల్లో ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).