- Telugu News Photo Gallery Tallest Garuda Maha Vishnu statue in the world take nearly 25 years to construction
Tallest Vishnu Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహా విష్ణు విగ్రహం.. నిర్మాణానికి ఇన్ని సంవత్సరాల.!
సాధారణంగా మన దేశంలో దేవాలయాలు అనేకం ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో మన భగవంతుడిని ఆరాధిస్తూన్నారు.ఇదిలాఉంటే అత్యంత ఎత్తైన మహావిష్ణువు విగ్రహం నిర్మించారు తెలుసా... ఎక్కడుందో.. ఎవరు నిర్మించారో.. ఎన్నో కోట్ల ఖర్చు పెట్టారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: May 27, 2023 | 1:13 PM

సాధారణంగా మన దేశంలో దేవాలయాలు అనేకం ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో మన భగవంతుడిని ఆరాధిస్తూన్నారు.ఇదిలాఉంటే అత్యంత ఎత్తైన మహావిష్ణువు విగ్రహం నిర్మించారు తెలుసా... ఎక్కడుందో.. ఎవరు నిర్మించారో.. ఎన్నో కోట్ల ఖర్చు పెట్టారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు భగవానుడి విగ్రహం. మన దేశంలో లేదు.. కానీ ఇండోనేషియాలో ఉంది. ఎన్నో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి విష్ణు భగవంతుడి విగ్రహాన్ని నిర్మించారు.

ఈ విగ్రహం దాదాపు 122 అడుగుల ఎత్తు.. 64 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అంతేకాదు.. ఈ విగ్రహాన్ని రాగి, ఇత్తడితో నిర్మించారు. ఈ విగ్రహం నిర్మించడానికి దాదాపు 24 సంవత్సరాలు పట్టింది. 2018లో విష్ణు దేవుడి విగ్రహం పూర్తిగా సిద్ధమైంది.

బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కల ఉంది. 1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడట. ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుధీర్ఘ కాలం ప్రణాళిక చేసి.. అందుకు కాస్త డబ్బు పొగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు.

2007, 2013 మధ్య కొంత డబ్బు కొరత ఏర్పడింది. దీంతో విగ్రహ తయారీ నిలిచిపోయింది. అంతేకాకుండా.. విగ్రహా నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు. అయితే పర్యాటకం, ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు. దీంతో విగ్రహ తయారీ మళ్లీ ప్రారంభమైంది. 2018లో పూర్తిగా విగ్రహం సిద్దమైంది. అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు.

విష్ణు మూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా నుమాన్ భారతదేశంలో కూడా గౌరవించబడ్డారు. మన దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ దేశ అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మ శ్రీతో సత్కరించారు. ఈ విగ్రహం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడికి ఇతర మతాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.





























