AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbha Mela 2025: కుంభ మేళాల్లోనే దర్శనం ఇచ్చే అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..

అఖారా అనేది భారతదేశంలోని సాధువులకు, ఋషులకు సంబంధించిన సంస్థ. ఇది శతాబ్దాలుగా మతపరమైన, సామాజిక జీవితంలో అంతర్భాగంగా ఉంది. ఈ సంస్థలు మతపరమైన జ్ఞానానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రాలు మాత్రమే కాదు సామాజిక సంస్కరణ , జాతీయ సమైక్యతలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహా కుంభమేళా జరగనున్న సందర్భంగా ఈ అఖారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maha Kumbha Mela 2025:  కుంభ మేళాల్లోనే దర్శనం ఇచ్చే అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
Akhara History
Surya Kala
|

Updated on: Dec 17, 2024 | 3:57 PM

Share

ప్రయాగ్‌రాజ్‌లో 13 జనవరి 2025 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ మహా కుంభ మేళా జాతర ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు దర్శనం ఇస్తారు. ఎన్నడూ సామాన్యులకు లేదా బహిరంగ సమాజంలో జీవించని సాడువులు సైతం కుంభ మేళా, మహా కుంభ మేళా వంటి సందర్భాలలో మాత్రమే కనిపిస్తారు. కుంభమేళా సమయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలలో అఖారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి పరిస్థితిలో కుంభ మేళాలు జరిగే సమయంలో మాత్రమే కనిపించే ఈ విభిన్న అఖారాలైన సాధువుల గురించి తెలుసుకుందాం?

అఖరాలు అంటే ఏమిటి..?

అన్ని అఖారాలకు చెందిన సాధువులు, ఋషులు ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకి చేరుకుంటారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించి విశ్వాసంతో గంగమ్మ తల్లిని పూజిస్తారు. ఈ సాధువుల సమూహాన్ని అఖారా అంటారు. సాధారణంగా అఖారా అనే పదాన్ని మల్లయోధులు కుస్తీ చేసే ప్రదేశానికి ఉపయోగిస్తారు. మహా కుంభమేళా లేదా కుంభ మేళాలో పాల్గొనే సాధువుల బృందానికి అఖారా అనే పేరు ఆదిశంకరాచార్య పెట్టారు. అఖారాలు ఆధ్యాత్మిక , హిందూ సనాతన ధర్మం, సాంస్కృతిక రక్షకులు అని నమ్ముతారు.

ప్రధానంగా 13 అఖారాలు

దేశవ్యాప్తంగా ఈ అఖారాల సంఖ్య ప్రధానంగా 13. ఈ అఖారాలన్నీ శైవ, వైష్ణవ, ఉదాసిన్ శాఖల సన్యాసులకు చెందినవి. ఈ శాఖలకు చెందిన ఆఖరాలకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ 13 అఖారాలలో 7 శైవ సన్యాసి శాఖకు చెందినవి. బైరాగి వైష్ణవ శాఖలో 3 అఖారాలు ఉన్నాయి. అదేవిధంగా ఉదాసిన్ వర్గానికి కూడా 3 అఖారాలు ఉన్నాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ అఖారాలకు శతాబ్దాల కాలం నాటి ఉనికి, చరిత్ర ఉంది.

ఇవి కూడా చదవండి

ఆదిశంకరాచార్యలుచే స్తాంపించబడిన అఖారాలు

హిందూ విశ్వాసాల ప్రకారం ఆదిశంకరాచార్య ఆయుధాల పరిజ్ఞానం ఉన్న ఋషుల సంస్థలను సృష్టించారు. ఆదిశంకరాచార్య హిందూ మతాన్ని రక్షించడానికి ఈ సాధువుల సంస్థలను సిద్ధం చేశారు. ఈ సంస్థలకు అఖారా అనే పేరు పెట్టారు. మహా కుంభ మేళా లేదా కుంభ మేళాలోని అఖారాలు సాంస్కృతిక వారసత్వం సంగ్రహావలోకనం ఇస్తాయి. హిందూ సనాతన ధర్మం నిలబెట్టడంలో వీరి పాత్ర కూడా ఉంటుంది. అఖారాలు పవిత్ర గ్రంథాలను, సంప్రదాయాలను రక్షిస్తాయి. తద్వారా అవి భవిష్యత్ తరాలకు అందించబడతాయి. మతపరమైన ప్రదేశాలను రక్షించడానికి నాగ సాధువుల అఖారాలు యుద్ధానికి సంబంధించిన సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తాయని ఆదిశంకరాచార్యలు దిశా నిర్దేశం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.