Tirumala: వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కావాలా..

తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదలపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. మార్చి నెలలో పరీక్షల సీజన్ మొదలు కానుంది. ఈ నేపధ్యంలో తిరుపతి క్షేత్రానికి వెళ్ళాలని శ్రీవారిని దర్శించుకోవాలని ముందస్తుగా ప్లాన్ చేసుకునేవారికి వీలుగా మార్చి నెలకు సంబంధించిన పలు శ్రీవారి సేవలకు సంబందించిన టికెట్స్ తో పాటు శీవారి దర్శనం కోటాను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది.

Tirumala: వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కావాలా..
Tirupati
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Dec 17, 2024 | 4:13 PM

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న విడుదల చేయనుంది. ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్ఛని ప్రకటన జారీ చేసింది. సేవా టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్‌ లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరుతోంది.

డిసెంబ‌రు 21న ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

డిసెంబ‌రు 21న వర్చువల్ సేవల కోటా విడుదల…

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

ఇవి కూడా చదవండి

డిసెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు.

మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

డిసెంబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

గదుల కోటా విడుద‌ల‌..

తిరుమల, తిరుపతి ల‌లో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

డిసెంబరు 27న మార్చి నెల శ్రీవారి సేవ కోట విడుదల చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెంకన్న భక్తులకు అలెర్ట్ మార్చి నెల పలు సేవల కోటా ఈనెల 18న రిలీజ్
వెంకన్న భక్తులకు అలెర్ట్ మార్చి నెల పలు సేవల కోటా ఈనెల 18న రిలీజ్
ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
ఓర్నీ ఇంత కథ ఉందా..? డయాబెటిక్ రోగులకు హైబీపీ ఎందుకు వస్తుందంటే..
ఓర్నీ ఇంత కథ ఉందా..? డయాబెటిక్ రోగులకు హైబీపీ ఎందుకు వస్తుందంటే..
కిర్రాక్ ఫీచర్లతో వివో ఫోన్ల సూపర్ ఎంట్రీ..!
కిర్రాక్ ఫీచర్లతో వివో ఫోన్ల సూపర్ ఎంట్రీ..!
క్యారెట్ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే.. షాక్ అవుతారు!
క్యారెట్ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే.. షాక్ అవుతారు!
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. ఏపీలో ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు..
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. ఏపీలో ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు..