- Telugu News Photo Gallery Is the floor of your house this color? These things are for you, Check Here is Details
Vastu Tips: మీ ఇంటి ఫ్లోర్ ఈ రంగులో ఉందా.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో వేసుకునే ఫ్లోరో విషయంలో కూడా వాస్తు శాస్త్రం పని చేస్తుంది. రంగులను బట్టి కూడా వాస్తు శాస్త్రం పని చేస్తుంది. కొన్ని రకాల రంగుల ఫ్లోర్ బట్టి ఇంట్లో జరిగే అభివృద్ధి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో వేసుకునే ఫ్లోర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Updated on: Dec 17, 2024 | 4:34 PM

ఇంటిని అందంగా నిర్మించుకోవడం అనేది ఒక కళ. ఎవరి ఇష్టాన్ని బట్టి, స్థోమతను బట్టి వాళ్లు ఇంటిని కడుతూ ఉంటారు. అందమైన ఇల్లు ఉండాలనేది అందరి కళ. ఇక వారి ఇష్టా ఇష్టాలను బట్టి ఇంట్లో ఫ్లోరింగ్ వేయిస్తూ ఉంటారు. ఆ ఫ్లోరింగ్ రంగులను బట్టి కూడా వారి అభివృద్ది జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంటిని నిర్మించేటప్పుడే కాకుండా.. ఇంట్లో ఉండే వస్తువులు, రంగులను బట్టి కూడా వాస్తు శాస్త్రం రూల్స్ ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా టైల్స్ లేదా గ్రానైట్ వేయిస్తూ ఉంటున్నారు. వీటి రంగు బట్టి మీ ఇల్లు అభివృద్ధి జరుగుతుంది.

ఇంట్లో నలుపు రాయితో ఫ్లోర్ వేయించుకునే వారు ఎంతో తెలివారు అవుతారట. ఈ ఇంట్లో నివసించే వారు కూడా జీవితంలో త్వరగా అభివృద్ధి చెందుతారని, ఉన్నత స్థానానికి చేరుకుంటారని వాస్తు శాస్త్రం చెబుతుంది.

అలాగే చాలా మంది తెలుపు రంగు వేయించుకుంటూ ఉంటారు. తెలుపు రంగు ఫ్లోర్ వేసుకన్నవారి ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొదువ ఉండదట. వీళ్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పుడూ కొలువై ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అదే విధంగా పసుపు రంగు ఫ్లోర్ వేయించుకుంటే మరింత మంచిదని, అన్ని శుభాలు కలుగుతాయని, ధనానికి ఎలాంటి లోటు ఉండదని అంటున్నారు. నీలం రంగు ఫ్లోర్ వేసుకన్నా మంచిదే. కానీ ఎరుపు రంగు ఫ్లోర్ వేసుకోకూడదని వెల్లడిస్తున్నారు.




