- Telugu News Photo Gallery These are the must eat foods in winter Season, Check Here is Details in Telugu
Winter Foods: చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
వింటర్ సీజన్‌లో త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రత లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. పొంగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల త్వరగా జబ్బుల బారిన పడతారు. కాబట్టి హెల్దీగా ఉండే ఆహారాలు తీసుకోవాలి..
Updated on: Dec 17, 2024 | 4:07 PM

వింటర్ సీజన్‌లో ఆరోగ్య పరంగా, ఆహార పరంగా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఇతర సీజన్ల కంటే ఈ సీజన్‌లో రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల శీతా కాలం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. చలి కాలంలో తినాల్సిన ఆహారాల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరలో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇంది మంచి సూపర్ ఫుడ్‌గా చెబుతారు. శరీరానికి శక్తిని ఇవ్వడంలో పాలకూర సహాయ పడుతుంది.

మెంతి కూర తినడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్లు కూడా తినడం చాలా ముఖ్యం. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. క్యారెట్‌ని కూడా సూపర్ ఫుడ్‌గా చెబుతారు. అలాగే క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ, బీట్ రూట్ వంటివి కూడా మీ డైట్‌లో చేర్చుకోండి.

విటమిన్ సి ఉండే అన్ని రకాల పండ్లు శీతా కాలంలో తినాలి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా వింటర్ సీజన్‌లో లభించే పండ్లను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు.




