మధురై ఆలయ ఏనుగుకు అస్వస్థత..! చికిత్స కోసం థాయ్‌లాండ్‌ నుంచి ఏడుగురు వైద్యుల బృందం..

వైద్య‌ బృందం సేవ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం పార్వతి కంటికి మరింత నష్టం జరగకుండా నిరోధించడం సవాలుతో కూడుకున్నదని వైద్యులు తెలిపార‌ని మంత్రి అన్నారు. పార్వతి పరిస్థితి

మధురై ఆలయ ఏనుగుకు అస్వస్థత..! చికిత్స కోసం థాయ్‌లాండ్‌ నుంచి ఏడుగురు వైద్యుల బృందం..
Madurai Temple Elephant
Jyothi Gadda

|

Jun 27, 2022 | 10:08 PM

తమిళనాడులోని మదురై మీనాక్షి దేవాలయం 24 ఏండ్ల పార్వతి అనే ఏనుగుకు థాయ్‌లాండ్ వైద్యులు చికిత్స చేశారు. ఏనుగు ఎడమ కంటి చూపు దెబ్బతిన్నది. ఆ తర్వాత కంటిశుక్లం రెండో కంటికి వ్యాపించింది. క్రమంగా పరిస్థితి క్షీణించింది. దాంతో ఏనుగును ప‌రీక్షించేందుకు థాయ్‌లాండ్ నుంచి కాసెట్‌సార్ట్ యూనివర్సిటీ వెటర్నరీ మెడిసిన్ విభాగం నుంచి నిక్రాన్ థోంగి నేతృత్వంలోని వెటర్నరీ వైద్యుల బృందం వచ్చింది. ఏడుగురు సభ్యుల వెటర్నరీ బృందం మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి, ఏనుగు కంటిశుక్లంకు చికిత్స‌ చేసింది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ పీ త్యాగ‌రాజన్.. వైద్య‌ బృందం సేవ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం పార్వతి కంటికి మరింత నష్టం జరగకుండా నిరోధించడం సవాలుతో కూడుకున్నదని వైద్యులు తెలిపార‌ని మంత్రి అన్నారు. పార్వతి పరిస్థితి జన్యుపరమైన లేదా గతంలో జరిగిన గాయం వల్ల కావచ్చునని వైద్యులు చెప్పారని మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఏనుగుకు శస్త్రచికిత్స కష్టం కావడంతో మందుల ద్వారా నయం చేయాలని నిర్ణయించారు. డీఎంకే పాలనలో మనుషులే కాదు. శాసనసభలో జంతువుల కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి పీడీఆర్ పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu