Lunar Eclipse 2021 : భారత దేశంలో ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుందో తెలుసా..!
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. చంద్ర గ్రహణం పౌర్ణమి నాడు..
Lunar Eclipse 2021 : చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. చంద్ర గ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. ఇక హిందూ సంప్రదాయంలో గ్రహణం కాలాన్ని సూతకం అని భావిస్తారు. గ్రహణానికి ముందు సమయాన్ని ‘సూతక’ కాలం అని పిలుస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కానీ పూజాలను కానీ నిర్వహించరు. ఈ సూతక కాలం గ్రహణం ప్రారంభమై 9 గంటల ముందు ప్రారంభమవుతుంది .. గ్రహణంతో ముగుస్తుంది.
అయితే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. మే 26న ఈ ఏడాది చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కొని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కావడం గమనార్హం. గ్రహణల్లో దాదాపు మూడు రకాలు ఉన్నాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షిక చంద్ర గ్రహణం, పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం. అయితే సూపర్ మూన్ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడితే., అపుడు (ఎర్రగా) కనపడే పౌర్ణమి నాటి చంద్రున్ని “బ్లడ్ మూన్” అని పిలుస్తారు..
2021 చంద్రగ్రహణం కనిపించే దేశాలు..
మొదటి చంద్ర గ్రహణం ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా , పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలతో పాటు పాక్షికంగా భారత్‌తో కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 14 నిమిషాల పాటు.. సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
ఇక ఈ చంద్ర గ్రహణం పాక్షికంగా దక్షిణ , తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో ఏర్పడనుంది.
భారత్ లో చంద్ర గ్రహణ సమయం :
భారత్ లో పెనుంబ్రాల్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కేవలం కొన్ని నిమిషాల పాటు చంద్రగ్రహణం కనిపించనుంది. మనదేశ కాలమానం ప్రకారం చంద్ర గ్రహణ ప్రారంభ సమయం మే 26వ తేదీ బుధవారం సాయంత్రం గం 19:14 నిముషాలు .. విడుపు సమయం గంటలు 19:19నిముషాలు.. అంటే గ్రహణ ప్రభావం భారత్ పై కేవలం ఐదు నిముషాలు మాత్రమే ఉండనుంది.
దీంతో భారత్ లో చంద్రగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలుస్తోంది. ఇక 2021 లో రెండవ చంద్ర గ్రహణం 20 నవంబర్ 2021 న ఏర్పడనుంది. ఇది భారతదేశం తో పాటు, అమెరికా, ఉత్తర ఐరోపా, పసిఫిక్ మహాసముద్రం మరియు ఆస్ట్రేలియాలో కూడా ఇది కనిపిస్తుంది.