Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 43,845 పాజిటివ్‌ కేసులు నమోదు

Coronavirus: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కేసుల సంఖ్య తగ్గినట్లు తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌లో గడిచిన..

Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 43,845 పాజిటివ్‌ కేసులు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 21, 2021 | 12:01 PM

Coronavirus: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కేసుల సంఖ్య తగ్గినట్లు తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,845 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1,15,99,130కి చేరగా, కొత్తగా 22,956 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కి చేరగా, రివకరీ రేటు 96.12 శాతానికి తగ్గింది. ఇక కరోనాతో తాజాగా 188 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,59,755 కు చేరింది. ఇక మరణాల రేటు 1.38శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,09,089కు చేరింది. అలాగే మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ శనివారం ఒక్క రోజు 27వేల కేసులకుపైగా నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్ర నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25.40 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 4,46,03,841కి చేరింది. కాగా, దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో పలు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి వస్తోంది.ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు.

మరోసారి విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్:Coronavirus Lockdown 2021 Live Video

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!