NCR Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో.. రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
నిరుద్యోగులకు రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వరసగా వివిధ ఖాళీలకు నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఉత్తర మధ్య రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,,,
NCR Recruitment 2021 : నిరుద్యోగులకు రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వరసగా వివిధ ఖాళీలకు నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఉత్తర మధ్య రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఉత్తర మధ్య రైల్వే లో ఈ నోటిఫికేషన్ ద్వారా 480 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. టెన్త్ పాస్ అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రిషన్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. పదవ తరగతి పాటు ఐటిఐ అదనపు అర్హతగా పరిగణిస్తారు.. అభర్ధులను నేరుగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అధ్యార్దులు ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో పనిచేయాల్సి ఉంది. ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 480
ఫిట్టర్ 286 వెల్డర్ 11 మెకానిక్ (డీజిల్) 84 కార్పెంటర్ 11 ఎలక్ట్రిషన్ 88
అర్హతలు: పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేయాలి
వయస్సు : 15 నుంచి 24 ఏళ్ల వరకూ
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ట్రైనింగ్‌కు ఎంపికచేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.170, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.70 అప్లికేషన్ కు లాస్ట్ డేట్ : ఏప్రిల్ 16
అధికారిక వెబ్ సైట్ @ncr.indianrailways.gov.in
Also Read: ప్రపంచంలో అతి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..