నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో ఖాళీలు.. వివరాలివే..

Jobs Recruitment:ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భారీ...

నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో ఖాళీలు.. వివరాలివే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 21, 2021 | 12:18 PM

Jobs Recruitment:ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్‌ మేళాలో అర్హత గల ఉద్యోగార్థులు పాల్గొనవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడలో ఈ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. పురుష, మహిళ ఉద్యోగార్థులు ఎవరైనా పాల్గొనవచ్చునని స్పష్టం చేసింది.

ఉద్యోగాల వివరాలు.. కంపెనీ: ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ రోల్: సార్టర్ & లోడర్ అసిసోసియేట్ ఆపరేషన్స్, క్వాలిఫికేషన్: పదవ తరగతి/ఇంటర్/డిగ్రీ పాస్, ఫెయిల్. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. జీతం: 10,683 + ఇతర సదుపాయాలు. వయసు: 18 నుంచి 26 మధ్య. ఖాళీలు: 30

కంపెనీ: ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ రోల్: బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్స్. క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ (బైక్ తప్పనిసరి, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.) ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే. జీతం: 17,500 ల నుంచి మొదలు+ఇన్సెంటీవ్స్+టీఏ వయసు: 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. ఖాళీలు: 20

జాబ్‌రోల్: ఫ్రీ లాన్సర్ క్వాలిఫికేషన్స్‌: పదవతరగతి(బైక్/డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరి) ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే. జీతం: పనిని బట్టి జీతం. వయసు: 18 నుంచి 30 సంవత్సరాల వయసు. ఖాళీలు: 200

Notification

కంపెనీ: ఎస్పీ క్యాపిటల్ సర్వీసెస్.. జాబ్ రోల్: టెలీకాలర్ క్వాలిఫికేషన్: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే. జీతం: 8 నుంచి 12 వేలు. + ఇన్సెంటీవ్స్. వయసు: 18 నుంచి 35 సంవత్సరాలు. ఖాళీలు: 40.

జాబ్ రోల్: టీమ్ లీడర్ క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ ఎక్స్‌పీరియన్స్: ఉండాలి. జీతం: 8 నుంచి 12 వేలు+ఇన్సెంటీవ్స్. వయసు: 18 – 35 సంవత్సరాలు. ఖాళీలు : 4

జాబ్ రోల్: డేటా ఎంట్రీ ఆపరేటర్ క్వాలిఫికేషన్: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ. ఎక్స్‌పీరియన్స్: ఉండాలి. జీతం: 8 నుంచి12 వేలు+ఇన్సెంటీవ్స్ వయసు: 18 – 35 సంవత్సరాలు. ఖాళీలు : 2

జాబ్ రోల్: హెచ్ఆర్ రిక్రూటర్ ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే. జీతం: 8 నుంచి 12 వేలు+ఇన్సెంటీవ్స్. వయస్సు: 18 నుంచి 35 వేళ్ల వరకు ఉండాలి. ఖాళీలు: 2

జాబ్ లొకేషన్: కంకిపాడు, విజయవాడ, కృష్ణా.. జాబ్ మేళా వేదిక: కెరీర్ వాక్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురగా, రాజ్ టవర్స్ పక్కన, ఏలూరు రోడ్డు, గవర్నర్‌పేట, విజయవాడ, సీఆర్‌డీఏ ప్రాంతం. వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు: 18004252422, 9030867757

Also read:

NCR Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో.. రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా ఎంపిక

Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 43,845 పాజిటివ్‌ కేసులు నమోదు