అచ్చు జయలలిత ప్రచార తరహాలో డీఎంకే అధినేత స్టాలిన్ క్యాంపెయిన్, మేం అధికారంలోకి వస్తే..

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్.. దివంగత సీఎం జయలలిత తరహాలో ప్రచారం చేస్తున్నారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు.

అచ్చు జయలలిత ప్రచార తరహాలో డీఎంకే అధినేత స్టాలిన్ క్యాంపెయిన్, మేం అధికారంలోకి వస్తే..
We Will Implement Welfare Schemes If We Get Victory Says Dmk President Mk Stalin
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 21, 2021 | 11:42 AM

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్.. దివంగత సీఎం జయలలిత తరహాలో ప్రచారం చేస్తున్నారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్ర పథాన్ని మార్చివేస్తాయని చెప్పిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాలు పెంచుతామని, రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తామని, అదే సమయంలో కోల్పోయిన హక్కులను పునరుధ్దరిస్తామని చెప్పారు. తమ పార్టీతో బాటు తమ మిత్ర పక్షాల అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క ఓటరూ  కృషి చేయాలన్నారు. అలా చేస్తారా అని ఆయన ప్రశ్నించగా ప్రజలు ఓకే అంటూ కేకలు పెట్టారు. లోగడ జయలలిత కూడా ఇలాగే తన ప్రచారం సందర్భంలో  ఓటర్ల నుంచి తనకు కావల్సిన సమాచారాన్ని, సమాధానాలను రాబట్టుకునేవారు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే పంథా అనుసరిస్తున్నారు.ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరూ ఈ దేశంలో మతతత్వ పోకడలను జొప్పించి నాశనం చేయజూస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోవలసి ఉందని స్టాలిన్ చెప్పారు. తమ మిత్ర పక్షమైన కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కూడా ప్రతివారు పూనుకోవాలని ఆయన అన్నారు.

పాలక అన్నాడీఎంకే ఈ రాష్ట్ర  హక్కులపై రాజీ పడిపోయిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దాసోహమంటోందని స్టాలిన్ ఆరోపించారు. కన్యాకుమారి నియోజకవర్గంలో మాట్లాడిన స్టాలిన్… ఈ జిల్లాలో  తమ కూటమి విజయం సాధిస్తుందని చరిత్ర చెబుతోందన్నారు . ఇది కొనసాగాలని కోరారు.  బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు చేటు తప్పదని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి పాటు పడతామని, వారికీ నెలకు 2 వేల ఆర్ధిక సాయం చేస్తామని స్టాలిన్ అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ కూటమి విజయానికి తోడ్పడగలరని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video

మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Video