Kamal Haasan injured : ఒక్కసారిగా మీదపడ్డ అభిమానులు, డాక్టర్ల సూచనతో ఎన్నికల ప్రచారం నిలిపివేసిన కమల్ హాసన్

Kamal Haasan injured : ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కాలికి గాయమైంది. తమిళనాడు దక్షిణ..

Kamal Haasan injured : ఒక్కసారిగా మీదపడ్డ అభిమానులు, డాక్టర్ల సూచనతో ఎన్నికల ప్రచారం నిలిపివేసిన కమల్ హాసన్
Kamal
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 20, 2021 | 5:06 PM

Kamal Haasan injured : ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కాలికి గాయమైంది. తమిళనాడు దక్షిణ కోయంబత్తూరులో కమల్ తన పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతని అభిమానులు ఒక్కసారిగా మీద పడటంతో కమల్‌ కాలికి గాయమైంది. గతంలో కమల్‌ కు ఆపరేషన్ జరిగిన కాలిని అభిమానులు తొక్కేశారు. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఎన్నికల ప్రచారం నిలిపివేశారు కమల్ హాసన్.

సౌత్ ఫిల్మ్ స్టార్ హీరో కమల్ హాసన్ తమిళనాడులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లో వడివడిగా అడుగులేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతోపాటు.. తృతీయ ప్రత్యామ్నాయంగా కమల్ ఎన్నికల బరిలో దిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ సైతం దాఖలు చేశారు. 2018 ఫిబ్రవరిలో కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే.. త‌మిళ‌నాడులో ఏప్రిల్ 6న ఒకే ద‌శ‌లో 234 స్థానాల‌కు ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే – బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

Read also : Japan Earthquake : ఈశాన్య జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ