TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం

ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గత సంవత్సరం మార్చి 20 నుంచి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది.

TTD News:  తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం
TTD
Follow us

|

Updated on: Mar 21, 2021 | 12:33 PM

Tirumala Tirupathi : ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గత సంవత్సరం మార్చి 20 నుంచి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది. అప్పటి నుంచి సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు అదుపులోకి రావడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండడంతో.. ఉగాది నుంచి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన తిరుప్పావడ, అష్టదళ పాదపద్మారాధన, అభిషేక సేవలకు భక్తులను అనుమతించాలనుకుంటోంది. ఈ ఏడాది సంబంధించి ముందస్తుగా అర్జిత సేవలను బుక్‌ చేసుకున్న భక్తులను మాత్రమే సేవలకు అనుమతించనున్నారు. కరెంట్‌ బుకింగ్‌ సదుపాయం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ 13 వరకు ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు వీఐపీ దర్శన టికెట్లు ఇస్తామన్నారు టీటీడీ అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి. వద్దనుకుంటే డబ్బులు వాపస్‌ చేస్తామన్నారు. కరోనా నిబంధనల కారణంగా ఆలయంలో స్థలాభావం నేపథ్యంలో అందరినీ అనుమతించడం సాధ్యం కాదన్న అభిప్రాయమూ ఉంది. 2021 సంవత్సరానికి సంబంధించి 28,258 సుప్రభాత టికెట్లను భక్తులు ముందస్తుగా బుక్‌ చేసుకున్నారు. అందులో తోమాల కోసం 6808 మంది, అష్టదళ పాదపద్మారాధన కోసం 2124 మంది, తిరుప్పావడ కోసం 2136 మంది, అభిషేకం కోసం 5464 మంది ముందస్తుగా బుక్‌ చేసుకున్నవారిలో ఉన్నారు. వీరిని మాత్రమే ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఈ సేవలో పాల్గొనే భక్తులు 3 రోజుల ముందుగా కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్లను తీసుకుని రావాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. కోవిడ్‌ తగ్గి పరిస్థితులు అదుపులోకి వస్తే ఆన్‌లైన్‌ బుకింగ్‌, డిప్‌ విధానం, విచక్షణా కోటాలను తిరిగి ప్రారంభిస్తామని అడిషనల్‌ ఈవో చెబుతున్నారు.

Also Read: Viral Video: ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో వైరల్.!

జూన్ 1 తర్వాత ఇది లేకుండా బంగారం అమ్మరాదు.. కొనరాదు.. ఎందుకో తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!