Tirupati By Election : తిరుపతి సీటు ఎవరికి ఇవ్వాలన్నదానిపై బీజేపీ తర్జనభర్జన, ప్రముఖంగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లు.!
Tirupati MP By Election : తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది కమల దళం. తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి..
Tirupati MP By Election : తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది కమల దళం. తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమే అని వాదిస్తున్నారు బీజేపీ నేతలు. దీన్ని ప్రజల్లో ప్రచారం చేసి, గెలిచి తీరాలని భావిస్తున్నారు. మరోవైపు తిరుపతి ఎంపీ సీటు ఎవరికి కేటాయించాలని తర్జనభర్జన పడుతోంది బీజేపీ. ఇదిలాఉంటే, ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్మాత్మకంగా మారింది. అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పాటు రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా జనసేన సహకారంతో ఇక్కడ కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది.
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఏపీలో పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బీజేపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు గెలిచే అభ్యర్థిని బరిలో నిలపాలని చూస్తున్నారు. దీని కోసం కొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యనేతలను అందరినీ సంప్రదించాకే అభ్యర్థిని ఖరారు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు, తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమే అంటున్నారు సోము. స్మార్ట్ సిటీకి 2500 కోట్లు కేటాయించామని, ఈసారి కేంద్ర బడ్జెట్‌లో తిరుపతికి నాలుగు రైల్వేలైన్లు మంజూరు చేశామని తెలిపారు. తిరుపతిలో ఉన్న పార్కుల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని, ఇందులో ముక్కుపుల్లంత శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదంటున్నారు సోము వీర్రాజు.
బీజేపీ, జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్, కర్నాటక సీఎస్‌గా పనిచేసిన రత్నప్రభ, రిటైర్డ్ డీజీ కృష్ణప్రసాద్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నాట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు స్థానిక నేతలతో కలిపి దాదాపు 20 మంది బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Read also : Param Bir Singh Vs Anil Deshmukh : నెలకు 100 కోట్లు వచ్చి పడాలనేది హోంమంత్రి మౌఖిక ఆదేశాల్లోని సారాంశమట.!