ఇంట్లోకి పావురం రావడం మంచిదేనా ?.. ఇంటి పరిసరాల్లో పక్లులు గూడు కట్టుకుంటే ఏం జరుగుతుందంటే..
హిందూ సంప్రదాయంలో పీల్చే గాలి నుంచి నడిచే నేల వరకు ప్రతీదానికి ఒక నమ్మకం ఉంటుంది. ఆచార సాంప్రదాయలకు ఎక్కువగా విలువనిస్తుంటాం.
హిందూ సంప్రదాయంలో పీల్చే గాలి నుంచి నడిచే నేల వరకు ప్రతీదానికి ఒక నమ్మకం ఉంటుంది. ఆచార సాంప్రదాయలకు ఎక్కువగా విలువనిస్తుంటాం.. అలాగే వాటిపై నమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లి ఎదురువస్తే వెళ్లే పని జరదని.. ఇంట్లోకి ముంగిస రాకూడదని.. కాకి ఇంటి ముందు అరిస్తే అరిష్టమని.. పక్షులు ఇంట్లోకి వస్తే మంచిదని.. ఇలా ఒక్కటేమిటీ అనేక విశ్వాసాలున్నాయి. అయితే పావురం ఇంట్లోకి రావడం.. గూడు కడితే దురదృష్టం అని కొందరు అంటుంటే.. మరి కొందరు మాత్రం శుభం అంటున్నారు. పావురాలకు పెంచడానికి చాలా మంది ఇష్టపడతారు.. కానీ.. అదే పావురం ఇంట్లో గూడు కడితే అరిష్టమంటారు. ఇంట్లో పావురం గూడు నిర్మిస్తే నిజాంగానే అరిష్టమా.. లేక శుభమా.. తెలుసుకుందామా.
పావురాన్ని లక్ష్మీ దేవి భక్తుడిగా భావిస్తారు. ఇంట్లో పావురం ఉంటే శుభపరిణామంగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో పావురం గూడు కట్టుకుంటే కుటుంబంలో ఆనందం.. శ్రేయస్సు వస్తాయి. అదే ఇంటి టెర్రస్ పై పావురం గూడు ఉంటే వెంటనే తొలగిస్తారు. అరిష్టమని భావిస్తారు. ఇంట్లో సమస్యలు వస్తాయని.. కుటుంబసభ్యుల పురోగతి నష్టపోతుందని నమ్ముతారు. కానీ శాస్త్రాలు.. గ్రంథాల ప్రకారం పావురాలకు ఆహారం పెట్టడం పుణ్యం. పావురాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు. దీనికి ఆహారం ఇవ్వడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు. కానీ ఇంటి పైకప్పుపై మాత్రం పావురం ఆహారం తినకూడదు. పావురానికి ఆహారం ఇవ్వాలనుకుంటే.. ఇంటి పరిసరాల్లో ఇవ్వాలి.. ఇలా చేయడం వలన బుధ, రాహు గ్రహాల దోషాలు తొలగిపోతాయి.
పావురానికి ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఇంట్లోనివారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. బుధుడు బలహీనంగా ఉన్నవారు పావురానికి ఆహారం పెట్టాలి. ఇంటి పెద్ద అనారోగ్యంగా ఉంటే.. పావురాన్ని బోను నుంచి వదిలేయ్యాలి.
గమనిక:- ఇది కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. హిందూ సాంప్రదాయాలు.. విశ్వాసాలు మాత్రమే.
Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..
RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్ కొట్టేసిన హైకోర్టు..
Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..