Holi 2022: హోలికా దహనం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు.. పొరపాటున మార్చిపోతే అశుభమే..

హోలీకా దాహనం (Holika Dahan). దీనినే కొన్ని చోట్లు కాముని దహనం అంటారు. హోలీకి ముందు రోజు రాత్రి ఈ హోలీకా

Holi 2022: హోలికా దహనం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు.. పొరపాటున మార్చిపోతే అశుభమే..
Holika Dahan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2022 | 11:02 AM

హోలీకా దాహనం (Holika Dahan). దీనినే కొన్ని చోట్లు కాముని దహనం అంటారు. హోలీకి ముందు రోజు రాత్రి ఈ హోలీకా దహనం జరుగుతుంది. హోలీకా దహనం… హోలీ గురించి మన హిందూ గ్రంథంలో అనేక కథలున్నాయి. ఒక్కో సందర్భంలో ఒక్కోలా చెబుతుంటారు. ఈ ఏడాది మార్చి 18న హోలీ పండగ వచ్చింది. ఫాల్గుణ మాసం.. పౌర్ణమి రోజున సూర్యూస్తమయం తర్వాత హోలీకా దహనం జరుగుతుంది. హోలీకా దహనం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున మర్చిపోయి చేస్తే మీకు ఏడాది మొత్తం అశుభమే.. మరి అవెంటో తెలుసుకుందామా.

హోలీకా దహనం రోజు పూజా చేసేటప్పుడు జుట్టు వదిలిపెట్టకూడదు. తలకు టవల్ లేదా మరేదైన వస్త్రం చుట్టు జుట్టును కప్పి ఉంచాలి. జుట్టు వదిలి పూజా చేస్తే మంచిది కాదు. కొత్తగా పెళ్లయిన జంటలు హోలీకా దహనం రోజున మండుతున్న అగ్నిని చూడకూడదు.. హోలీకా అగ్నిని చూడడం వలన వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. హోలీకా దహనం రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. నలుపు రంగు ప్రతికూలతకు చిహ్నంగా ఉంటుంది.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హోలీకా దహనం రోజున ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే.. హోలీకా దహనం రోజున భక్తుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రతికూల శక్తులన్ని ఏకమయ్యాయి. ఈ రాత్రి ప్రతికూల శక్తులు ప్రభావవంతంగా ఉంటాయి. ఆ సమయంలో భోజనం చేయకూడదు..

గమనిక :- ఈ కథనం కేవలం జ్యోతిష్యశాస్త్రం విశ్వాసాలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగానే ఇవ్వబడింది.

Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..

Mission Imposible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..

RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్‌ కొట్టేసిన హైకోర్టు..

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..