AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు TTD కల్పిస్తున్న పలు ఉచిత సేవలు ఏంటో తెలుసా?.. పూర్తి వివరాలు

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంటకటేశ్వర స్వామి (Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). శ్రీవారిని దర్శించుకోవాలని.. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవాలనే కోరిక సామాన్యుడి నుంచి..

Tirumala: శ్రీవారి భక్తులకు TTD కల్పిస్తున్న పలు ఉచిత సేవలు ఏంటో తెలుసా?.. పూర్తి వివరాలు
Tirumala
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 30, 2022 | 6:18 PM

Share

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంటకటేశ్వర స్వామి (Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). శ్రీవారిని దర్శించుకోవాలని.. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవాలనే కోరిక సామాన్యుడి నుంచి సెలబ్రెటీ, రాజకీయ నేతల వరకూ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.  అయితే ఉన్నవారు అయితే.. ఖర్చును లెక్కచేయరు.. అయితే సామాన్యుల్లో చాలామందిలో మాత్రం తిరుపతి ప్రయాణం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని..ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదనే అపోహ  ఉంది. కానీ తిరుమల తిరుపతి క్షేత్రంలోని సదుపాయాలు, దర్శనం చేసుకునే వీలు తదితర వివరాల గురించి పూర్తిగా అవగాహన ఉంటే.. స్వామివారిని దర్శించుకోవడం సులభం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని కన్నులారా వీక్షించవచ్చు.. రైల్వే స్టేషన్ లో దిగింది మొదలు.. స్వామివారిని దర్శించుకునే వరకూ అనేక ఉచిత సదుపాయూలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తిరుమలలో ఉచిత సౌకర్యం, దర్శనం సదుపాయాలు తదితర వివరాల గురించి తెలుసుకుందాం..

* రైల్వేస్టేషన్, బస్ స్టేషను నుండి అలిపిరి మెట్ల దారి వరకు ఉచిత రవాణా సదుపాయం.

* కాలినడకన వెళ్ళే భక్తుల లగేజి ఉచితంగా కొండ మీదకు చేర్చబడుతుంది.

* ఉచిత అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి ఉచిత భోజన సదుపాయం.

* శ్రీవారికి తల నీలాలు, మొక్కుబడులు ఉచితం

* తిరుమల మీద అనేక ఉచిత లగేజీ లాకర్ల సౌకర్యం

* తిరుమల కొండ మీద ఎక్కడ నుండి ఎక్కడికైనా ఉచిత రవాణా సౌకర్యం ఎన్నిసార్లు అయినా కొండమీద బస్సుల్లో తిరగవచ్చు

* తిరుమలలో 50 రూపాయల రుసుముతో వసతి సౌకర్యం.  అంతేకాదు ఉచిత లాకర్ సదుపాయం కూడా ఉంది.

*స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం ఉచిత (సర్వ) దర్శనం

* దర్శనం ఆలస్యం అయితే క్యూలో ఉన్న వారికి పాలు, ఉచిత అన్న ప్రసాదాలు అందచేస్తారు.

* వైద్య సదుపాయం అవసరమైన భక్తులకు ఉచిత వైద్య సదుపాయం 24 గంటలు ( అశ్వనీ హాస్పిటల్) అందుబాటులో ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీ కనుక అయితే వెంటనే  అశ్వనీ హాస్పిటల్ సిబ్బందిని అంబులెన్స్ లో తిరుపతి స్విమ్స్ కి తరలిస్తారు.

* కొండమీద లేపాక్షి ప్రక్కన ఉచిత ఆయుర్వేద వైద్యశాల కూడా ఉంది.

స్వామివారిని సామాన్యులకు మరింత చేరువ చేయడానికి టీటీడీ భక్తులకు అన్ని సదుపాయాలను ఉచితంగా  కల్పిస్తోంది. యాత్ర చేసే ముందు.. పూర్తి అవగాహనతో ఏర్పటు చేసుకుంటే.. ఈజీగా తక్కువ ఖర్చుతో మలయప్పస్వామిని దర్శించుకోవచ్చు.

Also Read:

TSRTC: భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సులు.. పూర్తి వివరాలివే

ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..