Vastu Tips: మీ ఇంట్లో వెండి తాబేలును పూజిస్తున్నారా ?.. అయితే ఈ విషయాలను తప్పకుండ తెలుసుకోండి..
హిందూ సంప్రదాయంలో వాస్తు నియమాలు పాటించడం సర్వసాధారణం. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం.. ఇంట్లో ఎలాంటి వస్తువులు..

హిందూ సంప్రదాయంలో వాస్తు నియమాలు పాటించడం సర్వసాధారణం. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం.. ఇంట్లో ఎలాంటి వస్తువులు.. ఏఏ ప్రదేశాల్లో అమర్చాలి అనే విషయంలో చాలా నియమాలు ఉంటాయి. అంతేకాకుండా.. ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం వలన ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. అలాగే కొన్ని నియమాలు పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయి. వాస్తు నియమాలు అనుసరించడం ద్వారా ఇంట్లో సానుకూలత వస్తుంది… సంతోషం, శాంతితో నిండిన వాతావరణం ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేయడమే కాకుండా.. బయటి నుంచి తెచ్చి ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావించేవి చాలానే ఉన్నాయి. వీటిలో ఒకటి వెండితో చేసినది. వాస్తు ప్రకారం.. వెండి తాబేలును ఇంట్లో ఉంచుకుంటే..డబ్బుకు లోటు ఉండదని.. శారీరక సమస్యలు మనకు దూరమవుతాయని అంటారు. మరి వాస్తు ప్రకారం వెండి తాబేలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామా.
డబ్బు తక్కువ.. ఇంట్లో డబ్బు లేకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కోంటున్నవారు.. ఇంట్లో వెండి తాబేలును ఉంచుకోవాలి. దీనిని ఉత్తరాన ఉంచడం మంచిది. ఇందుకోసం గాజు పాత్ర తీసుకుని అందులో కొంచెం నీరు తీసుకుని అందులో తాబేలును వేసి పెట్టాలి. కావాలంటే నీళ్లు లేకుండా ఖాళీ గాజు పాత్రలో వెండి తాబేలు పెట్టుకోవచ్చు. ఆర్థిక కష్టాలను తగ్గిస్తుంది.
వ్యాపారంలో లాభం.. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారు వెండి తాబేలును తీసుకోవాలి. ఇందుకోసం వెండి తాబేలుతో చేసిన ఉంగరాన్ని ధరించవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తాబేలు ఎక్కువగా నీటిలో ఉంటుంది. ఈ కారణంగా సంపద దేవత అయిన లక్ష్మీ దేవికి సంబంధించిందని విశ్వసిస్తారు. తాబేలు ఉంగరాన్ని ధరించేముందు దానిని పచ్చి పాలలో ఉంచి.. పూజ చేసిన తర్వాత మాత్రమే ధరించాలి.
విద్యార్థుల కోసం.. మీ పిల్లలు చదువుకోవడానికి ఆసక్తి చూపకపోవడం.. కష్టపడి చదివిన ఆశించినంత ఫలితాలు రాకపోయినప్పుడు కూడా వెండి తాబేలును ఉపయోగించుకోవాలి. వారు చదువుకునే స్థలంలో వెండి తాబేలును పెట్టాలి. దీనివలన పిల్లల మనససు ప్రశాంతంగా ఉంటుంది.. చదువులో సక్రమంగా ఏకాగ్రతతో ఉంటారు.
Note: వాస్తు టిప్స్ అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.
Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..
Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.