AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spatika Lingam: శుక్రదోషం ఉన్నవారు, వ్యాపారం అభివృద్ధి కోసం స్పటిక లింగం పూజించడం ఫలప్రదం..శివరాత్రిన మొదటి పూజ.. ఎందుకంటే

Spatika Lingam: హిందువుల(Hindus) ఆరాధ్య దైవమైన మహా శివుడి(Lord Shiva)ని దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మనదేశంలో శివాలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు..

Spatika Lingam: శుక్రదోషం ఉన్నవారు, వ్యాపారం అభివృద్ధి కోసం స్పటిక లింగం పూజించడం ఫలప్రదం..శివరాత్రిన మొదటి పూజ.. ఎందుకంటే
Spatika Lingam Abhishekam
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 01, 2022 | 7:58 PM

Share

Spatika Lingam: హిందువుల(Hindus) ఆరాధ్య దైవమైన మహా శివుడి(Lord Shiva)ని దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మనదేశంలో శివాలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. లింగ రూపంలో భక్తుల నుంచి పూజలను అందుకుంటున్న శివయ్యను స్పటిక లింగంలో ఆరాధిస్తే.. అత్యంత విశిష్టఫలితాలను అందుకుంటారని పురాణాల కథనం.  స్పటికం మహేశ్వర స్వరూపం.. స్పటికం.. ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ పూజించవచ్చు. శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు.

నిజానికి లింగం రూపంలో శివయ్యను పూజించడం వలన భక్తులు కోరిన కోరికలు తీరతాయని.. ఆరోగ్యం, ఐశ్యర్యం, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే లింగంల్లో స్పటిక లింగానికి ప్రత్యేకత ఉందని.. భక్తులు తమ కోరికను తీర్చమని.. స్పటిక లింగాన్ని పూజించడం వలన అద్భుతఫలితాలు పొందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాదు స్పటిక లింగం పరబ్రహ్మానికి చిహ్నం. తురీయమైన శివానికి అది గుర్తు.

అయిదు స్పటిక లింగాలు: ఆది శంకరాచార్యులు కైలాసం వెళ్ళి అయిదు స్పటిక లింగాలను తెచ్చారని.. మార్కండేయ సరిహతలో.. “శివలింగం ప్రతిష్ఠాప్య చిదంబర సభాతటే మోక్షదం సర్వజంతూనాం భువనత్రయసుందరం ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం కాంచ్యాం శ్రీకామకోటే తు యోగలింగ మనుత్తరం శ్రీ శారదాఖ్యపీఠేతు లింగం తం భోగనామకం” అంటూ ఆ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించారో వివరించారు.

కేదారనాథ్ లో ముక్తి లింగాన్ని, నేపాల్ లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని, చిదంబర క్షేత్రంలో కనక సభలో మోక్షలింగాన్ని, శృంగేరీ శారదాపీఠంలో భోగలింగాన్ని, కంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని ప్రతిష్ఠించటం జరిగిందని మార్కండేయ సరిహతలో పేర్కొన్నారు.

సమస్త విశ్వం శివమయం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ జలం సమర్పించినంతనే.. నేనున్నా నంటూ భక్తులు కోరిన కోరికలను తీర్చే భోళాశంకరుడు.

మొదటిసారి ఎలా పూజించాలంటే..:స్పటిక లింగాన్ని పూజించాలనుకునేవారు మొదట.. మహాశివరాత్రి రోజున పూజించడం అత్యంత శ్రేష్టం.. లేదా సోమ వారం, శుక్రవారం రోజున స్పటిక లింగాన్ని మొదటిసారిగా పూజించి.. అనంతరం పూజా మందిరంలో ప్రతిష్టించి అభిషేకించటం మంచిది. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్పటిక లింగాన్ని అభిషేకించటం మంచిది.

స్పటిక లింగం అభిషేక ఫలితాలు: రవి, శుక్ర గ్రహాలు కలసి ఉన్నప్పుడూ అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. ఇలాంటి దోష నివారణకు రవికి అధి దైవం అయిన శివస్వరూపమైన శివలింగాన్ని, శుక్ర గ్రహానికి చెందిన రత్నమైన స్పటికాన్ని శివలింగ రూపంలో అభిషేకించి అభిషేక తీర్ధాన్ని స్వీకరించటం ద్వారా అస్తంగత్వ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. స్పటిక లింగాన్ని నిత్యం పూజించడం వలన వివాహం విషయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. రోజూ స్పటిక లింగాన్ని పూజించేవారి వైవాహిక జీవితంలో సమస్యలు తీరి సుఖసంతోషాలతో ఉంటారు. అంతేకాదు స్పటిక లింగాన్ని అభిషేకించి.. ఆ తీర్ధాన్ని పుచ్చుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి కోసం స్పటిక లింగాన్ని వ్యాపార స్ధలంలో ఉంచి అభిషేకించటం వలన శుభఫలితాలను పొందవచ్చు. వ్యాపారంలో నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది. ఆర్థికాభివృద్ధి పొందుతారు.

Also Read:

 తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాల్లో బారులు తీరిన భక్తులు