Shivaratri 2022: తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాల్లో బారులు తీరిన భక్తులు
Mahashivaratri 2022: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని(Telugu states) శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో(Lord Shiva Temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమరావతి(Amaravati)లోని..
Mahashivaratri 2022: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని(Telugu states) శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో(Lord Shiva Temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమరావతి(Amaravati)లోని అమరేశ్వరాలయం శైవక్షేత్రం మహాశివరాత్రి నాడు ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకపూజలు ను నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుండి పవిత్ర కృష్ణానదీ తీరాన భక్తుల స్నానమాచరిస్తున్నారు. బాలాచాముండికా సమేత అమరేశ్వరున్నీ దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆధ్యాత్మిక శోభను సంఘటించుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు..దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీ సంఖ్యలో శివయ్య భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. ఆదిదంపతులైన భ్రమరాంబామల్లికార్జున స్వామిని దర్శించున్నారు. తెల్లవారు జామునుంచే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంకాలం స్వామి అమ్మవార్ల నందివాహన సేవను నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, స్వామివారికి తలపాగలంకరణ చేయనున్నారు. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.
నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాలతో పాటు, శివయ్య ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వరం, రామప్ప, సిద్దేశ్వరాలయంలో తెల్లవారుజము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలని నిర్వహిస్తున్నారు.
Also Read: