Shivaratri 2022: మహాశివరాత్రి విశిష్టత.. ఈరోజు ఉపవాసం, జాగరణ చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..

Mahashiva Ratri: మాఘ మాసం(Maghamasam) బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి భోళాశంకరుడి(Shankara)కి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ మహాశివరాత్రిని హిందువులు(Hindus) అత్యంత పర్వదినంగా ప్రతి ఏటా..

Shivaratri 2022: మహాశివరాత్రి విశిష్టత.. ఈరోజు ఉపవాసం, జాగరణ చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..
Maha Shivaratri
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2022 | 7:04 AM

Mahashiva Ratri: మాఘ మాసం(Maghamasam) బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి భోళాశంకరుడి(Shankara)కి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ మహాశివరాత్రిని హిందువులు(Hindus) అత్యంత పర్వదినంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. శివయ్యనామస్మరణ తో రోజంతా గడుపుతూ.. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు.  ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజునని కొందరు.. లింగోద్భవం జరిగిన రోజునని మరికొందరు నమ్ముతారు. ప్రకృతి, పురుషులకు అర్ధం శివపార్వతులు.. వీరికలయిక సృష్టికి అర్ధం పరమార్ధాన్ని సూచిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలేందుకు హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.

ఉపవాసం-జాగారం దీక్ష: భక్తవ శంకరుడు, భోళా శంకరుడుకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని శివుడికి జలంతో, బిల్వ పాత్రలతో అభిషేకం చేస్తారు. ఈరోజు సాత్విక ఆహారం తీసుకుని కొందరు.. ఉపవాస దీక్షను చేపట్టి..కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఇంకొందరు శివయ్యను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహాశివరాత్రికి జాగరణ దీక్షలతో స్వామి వారిని పూజిస్తారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెబుతారు.

పురాణాల ప్రకారం:మహాశివరాత్రి రోజున సృష్టి, సంరక్షణ, విధ్వంసం తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అనేక పురాతన ఇతిహాసాలు శివరాత్రి పర్వదినం గురించి అనేక కథలు ఉన్నాయి. ఈ రాత్రి శివయ్యని ప్రార్థించడంవలన తమ పాపాలను అధిగమించి ధర్మమార్గంలో నడిచిన వారికీ సద్గతులు లభిస్తాయని నమ్మకం. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడవం వలన శుభం కలుగుతుందని నమ్మకం.

లింగోద్భవం: త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివయాల్లో ఎవరు గొప్ప అనే సంవాదం నెలకొంది. ఎవరు గొప్ప అనే వాదన సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెప్పాడని.. పురాణాల కథనం. లింగం అంతం తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో..అదే సమయంలో ఆదిని కనుకోవడానికి లింగంపై భాగం వైపు వెళ్తాడు. అయితే బ్రహ్మ, విష్ణు లిద్దరూ.. మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కో లేక పోతారు. ఆయితే బ్రహ్మ ఆది కనుకోవడానికి వెళ్తున్న సమయంలో మధ్యంలో బ్రహ్మకు మొగలి పువ్వు (కేతకీ పుష్పం), గోవు దర్శనమిస్తాయి. వారికి తాను లింగానికి ఆదిని చూశానని చెప్పమని.. అదే విషయం విష్ణు, శివయ్యలకు చెప్పాల్సిందిగా సూచిస్తాడు. దీంతో శివుడికి బ్రహ్మ చెప్పినట్లు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెబుతారు. దీంతో ఆగ్రహించిన భోళాశంకరుడు బ్రహ్మకు గుడి ఉండదని.. మొగలి పువ్వు పూజకు పనికిరాదని, ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్దం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోక ని చూస్తే పాపపరిహారం గా శివుడు శపిస్తాడు. అయితే విష్ణువు తాను లింగం అంతాన్ని కనుక్కోలేకపోయానని విష్ణువు నిజం చెప్పద్మతో.. ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం ,మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువు ఇవ్వడం లింగోద్భవ సమయంలో జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో పేర్కొన్నారు.

శివుడికి కూడా బ్రహ్మ.. లింగ రూపంలోనే పూజలను అందుకుంటావని తిరిగి శపించిన కారణంగా శివయ్యకు ఎక్కువగా లింగంతోనే ఆలయాలున్నాయి. లింగరూపంలోనే భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అందుకనే ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో జలాభిషేకం చేస్తే.. అత్యంత పవిత్రమని పురాణాలు పేర్కొన్నాయి.  హరహర మహాదేవ శంభో శంకర అంటూ  శివనామస్మరణతో దేశంలోని ప్రతి శివాలయం, శైవ క్షేత్రాలు  మారుమ్రోగుతాయి.

Also Read:

ఈరోజు ఈ రాశివారు శుభఫలితాను అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..