Sabarimala: శబరిమలలో ముగిసిన అయ్యప్ప దర్శనం.. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ఆలయం మూసివేత
శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికిగాను మండల, మకరవిలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30సమయంలో ప్రత్యేకపూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు. అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువలో తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు.
శరణుగోషతో మారుమోగిన శబరికొండలు మూగబోయాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా.. అదే స్థాయిలో ఆదాయం చేకూరింది. శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికిగాను మండల, మకరవిలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30సమయంలో ప్రత్యేకపూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు.
శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువలో తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుగా ఉండగా.. టోకెన్లు, స్లాట్ సిస్టమ్, ఆంక్షలున్నా గతేడాదికంటే 6లక్షల మంది అదనం వచ్చినట్లు చెప్పారు అధికారులు. 41 రోజుల పాటు సాగిన మండల-మకరవిళక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్నిమూసివేశారు. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు.
అలాగే ఈ ఏడాది 357 కోట్ల 47లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది ట్రావెన్‌కోర్. గతేడాదితో పోల్చితే దాదాపు పదికోట్లు అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు చెప్పారు అధికారులు. సీజన్‌కు 7 నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు TDB తెలిపింది. స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించి తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు. జనవరి 15న మకరవిళక్కు ఉత్సవం.. శుక్రవారం మలికప్పురం ఆలయంలో గురుతి నిర్వహించారు.
మరోవైపు అయ్యప్ప దర్శనం విషయంలోను ఎన్నడూ లేని విధంగా ఈఏడాది రాజకీయ రగడ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తులకు సరైన వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం అలసత్వం వహిందంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. మరోవైపు భక్తులకు తలెత్తున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు సుమోటో కేసును స్వీకరించింది. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోర్టు. ప్రభుత్వం వెంటనే యాక్షన్ షురూ చేసింది. రద్దీని క్రమబద్దీకరించడంలో చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఏడాది అయ్యప్ప దర్శనం పూర్తయింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..