Ayodhya Ram Mandir: సచిన్‌, కోహ్లీ, సింధూతో సహా అయోధ్య రామయ్య ఆహ్వానం అందుకున్న క్రీడా ప్రముఖులు వీరే..

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, 'స్ప్రింట్ క్వీన్' పీటీ ఉష, స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి భైచుంగ్ భూటియాతో సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలు అందాయి.

Ayodhya Ram Mandir: సచిన్‌, కోహ్లీ, సింధూతో సహా అయోధ్య రామయ్య ఆహ్వానం అందుకున్న క్రీడా ప్రముఖులు వీరే..
Ayodhya Ram Mandir Inauguration
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 10:12 AM

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి . సోమవారం (జనవరి 22) న జరిగే ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్నారు. ఇందులో పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ‘స్ప్రింట్ క్వీన్’ పీటీ ఉష, స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి భైచుంగ్ భూటియాతో సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలు అందాయి. రామ్ లాల్ ప్రాణ ప్రతిష్ట వేడుక ఆహ్వాన జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, నటులు, క్రీడా తారలు, వ్యాపారవేత్తలు సహా 500 మందికి పైగా ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. క్రీడా ప్రముఖుల విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరితో పాటు అయోధ్య రామయ్య పిలుపు అందుకున్న క్రీడా ప్రముఖుల పూర్తి జాబితా ఇదే.

అయోధ్య రామ మందిర పిలుపు అందుకున్న క్రికెటర్లు వీరే..

  • సచిన్ టెండూల్కర్
  • ఎంఎస్ ధోని
  • విరాట్ కోహ్లీ
  • రోహిత్ శర్మ
  • సునీల్ గవాస్కర్
  • కపిల్ దేవ్
  • రాహుల్ ద్రవిడ్
  • వీరేంద్ర సెహ్వాగ్
  • సౌరవ్ గంగూలీ
  • అనిల్ కుంబ్లే
  • రవీంద్ర జడేజా
  • రవిచంద్రన్ అశ్విన్
  • మిథాలీ రాజ్
  • హర్మన్‌ప్రీత్ కౌర్
  • గౌతమ్ గంభీర్
  • హర్భజన్ సింగ్

జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 21 నుంచి హైదరాబాద్‌లో చాలా మంది టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. మరి ఈ జాబితాలో అయోధ్యలో ఎవరు కనిపిస్తారో, ఎవరు కనిపించరు అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇతర క్రీడా తారలు కూడా..

క్రికెటర్లతో పాటు వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లీశ్వరి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి కళ్యాణ్ చౌబే, స్ప్రింటర్ కవితా రౌత్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియాలకు కూడా ఆహ్వానాలు పంపారు. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు కూడా ఆహ్వానం అందింది.

ధోనికి ఆహ్వానం అందజేస్తున్న శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు..

సచిన్ టెండూల్కర్ కు పిలుపు..

ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా క్రికెటర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
షుగర్ నార్మల్‌గా ఉండాలంటే వారానికి నాలుగు గుడ్లు తినండి చాలు
షుగర్ నార్మల్‌గా ఉండాలంటే వారానికి నాలుగు గుడ్లు తినండి చాలు
అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..!
అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..!
దశాబ్దాల ఉత్సవం.. నువ్యుల నూనెతో దేవుడికి నైవేధ్యం...అది తాగిన
దశాబ్దాల ఉత్సవం.. నువ్యుల నూనెతో దేవుడికి నైవేధ్యం...అది తాగిన
కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..
కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..
లాస్ ఏంజిల్స్‌లో మంటలు విధ్వంసం..పెను ప్రమాదంలో కోటి మంది ప్రజలు
లాస్ ఏంజిల్స్‌లో మంటలు విధ్వంసం..పెను ప్రమాదంలో కోటి మంది ప్రజలు
అమ్మో..పెద్ద పులి..పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌..షాకింగ్‌ వీడియో
అమ్మో..పెద్ద పులి..పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌..షాకింగ్‌ వీడియో
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..