IND vs BAN: బుద్ధి మార్చుకోని బంగ్లా క్రికెటర్లు.. భారత ప్లేయర్లతో మళ్లీ గొడవ.. వీడియో

బంగ్లా క్రికెటర్ల బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. సీనియర్లైనా, జూనియర్లైనా ప్రత్యర్థి ఆటగాళ్లతో గ్రౌండ్‌లోనే గొడవలకు దిగడం ఆ జట్టు క్రికెటర్లకు పరిపాటిగా మారింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లోనూ బంగ్లా ఆటగాళ్లు గొడవకు దిగారు.

IND vs BAN: బుద్ధి మార్చుకోని బంగ్లా క్రికెటర్లు.. భారత ప్లేయర్లతో మళ్లీ గొడవ.. వీడియో
India Vs Bangladesh
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2024 | 8:49 AM

బంగ్లా క్రికెటర్ల బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. సీనియర్లైనా, జూనియర్లైనా ప్రత్యర్థి ఆటగాళ్లతో గ్రౌండ్‌లోనే గొడవలకు దిగడం ఆ జట్టు క్రికెటర్లకు పరిపాటిగా మారింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లోనూ బంగ్లా ఆటగాళ్లు గొడవకు దిగారు. శనివారం (జనవరి 20) భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ పెట్టుకున్నారు. బ్లూమ్‌ఫోంటెయిన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమ్ ఇండియా తక్కువ స్కోరుకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆదర్శ్‌ సింగ్‌, కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ సమయంలో ఆదర్శ్ సింగ్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ సహారన్ అతనికి మంచి మద్దతు ఇచ్చాడు. ఆదర్శ్ సింగ్ 67 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు, అదే సమయంలో కెప్టెన్ సహారన్ కూడా ధాటిగా ఆడుతూ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యం సెంచరీకి చేరుకోవడంతో బంగ్లాదేశ్ బౌలర్లు, ఫీల్డర్లు అసహనానికి గురయ్యారు. గ్రౌండ్‌లోనే భారత కెప్టెన్ సహారన్‌తో మాటల యుద్ధానికి దిగారు.

మొదట బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాం భారత జట్టు కెప్టెన్‌తో మాటల యుద్ధానికి దిగాడు. భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. ఆతర్వాత కూడా భారత బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశారు బంగ్లా ఆటగాళ్లు. దీంతో టీమిండియా బ్యాటర్లు కూడా వారికి ధీటుగా బదులిచ్చారు. మాటకు మాట అంటూనే ఆటలోనూ తమ ప్రతాపం చూపారు. అయితే బంగ్లా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్లు వారిని వారించారు. పరిస్థితిని చక్కదిద్దారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 84 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్‌లో శుభారంభం అందుకుంది. టీమిండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్ 64 పరుగుల సహకారంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..