Ayodhya Ram Mandir: అంతా రామమయం.. డేగ కళ్ల మధ్య అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం..
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం.. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేస్తున్నారు.. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది.
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం.. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేస్తున్నారు.. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు.. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది..నేడు రాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు..ఇక రేపు మధ్యాహ్నం 12.29కి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగునుంది..
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా డేగకళ్లతో పోలీసులు నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు NIA, యూపీ ATS సహా సైబర్ టీమ్స్ యాక్టివేట్ అయ్యాయి. జపాన్, అమెరికా టెక్నాలజీకి ధీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటును చేశారు. సెక్యూరిటీ కోసం గరుడ డ్రోన్‌ను రంగం లోకి దింపారు. భద్రతతో పాటు భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి కూడా ఈ డ్రోన్‌ను ఉపయోగిస్తారు.
అయోధ్య రామమందిరాన్ని, అయోధ్య నగరాన్ని పుష్పాలతో అలంకరించేందుకు దాదాపు ఎనిమిది వందల మంది పనివాళ్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దాదాపు 1100 టన్నుల పూలను అలంకరణ కోసం ఉపయోగిస్తున్నారు.పూలపై జై శ్రీరామ్ అనే అక్షరాలు వచ్చేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అటు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహిస్తున్న యాగశాలకు సమీపంలో భక్తులు నిరంతరాయ రామనామం జపిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ అఖండ రామనామం జపం సాగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..