Dadri Fair: జ్యోతిష్యం పుట్టిన ప్రాంతంలో దాద్రీ జాతర.. 9 వేల ఏళ్ల క్రితమే నదుల సంగమం.. చరిత్ర తెలిస్తే భారతీయులకు గర్వమే..

ఇక్కడ జ్యోతిషశాస్త్రం జన్మించింది. రెండు నదులను అనుసంధానం జరిగింది. ఈ కథ 9 వేల సంవత్సరాల నాటిది. దాద్రీ జాతర చరిత్ర ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. క్రీ.పూ 7000 ప్రాంతంలో భృగు మహర్షి అయోధ్య నుంచి సరయు నది నీరుని గంగ నదిలో కలిపాడని నమ్ముతారు. ఈ సంగమం కార్తీక పౌర్ణమి రోజున జరిగింది. అదే రోజున భృగు మహర్షి జ్యోతిష్యం గురించి తాను రచించిన భృగు సంహిత పుస్తకాన్ని విడుదల చేశాడని చెబుతారు.

Dadri Fair: జ్యోతిష్యం పుట్టిన ప్రాంతంలో దాద్రీ జాతర.. 9 వేల ఏళ్ల క్రితమే నదుల సంగమం.. చరిత్ర తెలిస్తే భారతీయులకు గర్వమే..
Dadri Fair
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2024 | 9:14 PM

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జరిగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాద్రీ జాతర పేరు మీరు వినే ఉంటారు. ఈ జాతర ప్రారంభమై దాదాపు 10 రోజులైంది. నందిగ్రామ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ పశువుల కొనుగోలు, అమ్మకం ప్రారంభమైంది. మీనా బజార్ కూడా ఇక్కడ నవంబర్ 15వ తేదీ అంటే కార్తీక పౌర్ణమి రోజున నుంచి ప్రారంభమవుతుంది. ఈ జాతరకు చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాకుండా పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది. అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధానం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే అసలు నదుల అనుసంధానికి పునాది ఈ దాద్రి జాతరలోనే పడింది. ఈ జాతర ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా? ఈ జాతర గురించి మత్స్య పురాణం, పద్మ పురాణాలలో ప్రస్తావించబడింది.

శ్రీ మహా విష్ణువు ఛాతీపై తన్నిన తర్వాత భృగు మహర్షికి తాను చేసిన పని పాపంగా భావించాడు. తర్వాత అతను భూమి మీదకు వచ్చి బల్లియాలోని గంగా తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అతను ఖగోళశాస్త్రం, జ్యోతిషశాస్త్రంపై పరిశోధన చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి బల్లియా .. గంగా తీర ప్రాంతాన్ని భృగు ప్రాంతం అని పిలుస్తారు. జ్యోతిష్య గణనల సమయంలోనే మహర్షి భృగువు కలియుగ ప్రారంభ సమయంలో గంగా నది నీటి ప్రవాహం ఆగిపోతుందని చూశాడు. అది చూసి కంగారుపడి తన అభిమాన శిష్యుడైన దర్దార్ మునిని సంప్రదించాడు. ఆ సమయంలో భృగు మహర్షి అయోధ్య వరకు ప్రవహిస్తున్న సరయు నది జలధారను గంగలో కలిపితే గంగా నది జల ప్రవాహం నిరంతరం కొనసాగుతుందని భావించాడు.

ప్రపంచంలోనే తొలిసారిగా రెండు నదుల అనుసంధానం

ఈ ఆలోచనతో గురు శిష్యులిద్దరూ క్రీస్తు పూర్వం 7000 ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. అక్కడ వశిష్ఠ మహర్షి ముందు ఈ ప్రతిపాదన పెట్టాడు. వశిష్ఠ మహర్షి కూడా భృగు మహర్షి చెప్పిన విషయం విని కంగారుపడ్డాడు. వెంటనే రెండు నదుల అనుసంధానానికి అంగీకరించాడు. దీని తరువాత భృగు మహర్షి గీసిన పటం ఆధారంగా.. దర్దార్ ముని సరయు నీటి ప్రవాహాన్ని తీసుకుని బల్లియాలోని గంగా నదిలో కలిపాడు. పురాణాల ప్రకారం సరయు నది నీరు, గంగా ప్రవాహం ఒకదానికొకటి కలిసిన వెంటనే శబ్దాలు వినిపించాయి. ఈ స్వరాలు విన్న మహర్షి భృగు ఆ ప్రాంతానికి దర్దార్ అని పేరు పెట్టాడు. ఇది అతని శిష్యుని పేరు. అదేవిధంగా అయోధ్య నుంచి బల్లియాకు వచ్చే నది నీటి ప్రవాహాన్ని ఘర్ ఘర్ అంటే ఘఘ్రా అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

కార్తీక పౌర్ణమి రోజున దాద్రి జాతర

పురాణ కథల ఆధారాల ప్రకారం ఈ ఘాఘ్రా , గంగా నదుల సంగమం కార్తీక మాసం లోని పౌర్ణమి రోజున జరిగింది. మహర్షి భృగువు శిష్యుడైన దర్దార్ ముని గౌరవార్థం ఈ జాతర ఏటా జరుగుతుంది. ఈ జాతరను దర్దార్ దగ్గర నిర్వహించడం వల్ల దీనిని దాద్రి జాతర అని పిలుస్తారు. ఆ సమయంలో ఋషి భృగు జ్యోతిష్యంపై పరిశోధన పూర్తి చేసి ఈ పరిశోధన ఆధారంగా అతను ప్రపంచంలోనే మొదటి గ్రంథమైన భృగు సంహితను రచించాడు. ఈ పుస్తకాన్ని ఈ జాతరలో విడుదల చేశాడు. తన మూలాలను బహిరంగంగా పరీక్షించాడు.

జాతర ప్రాముఖ్యత ఏమిటంటే

దాద్రీ జాతరలో రెండు భాగాలు ఉంటాయి. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో నవంబర్ 1 నుంచి పశువుల సంత ప్రారంభమైంది. పశువుల సంతలో కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగంలో ఏనుగులు, గుర్రాలు, ఆవులు, గేదెలతో పాటు ఇతర జాతుల జంతువులను కొనుగోలు, అమ్మకాలు చేస్తారు. మరో భాగంలో గాడిదలను మాత్రమే విక్రయిస్తారు. దీనిని గార్దా ఫెయిర్ అంటారు. ఈ గాడిద జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. దేశం నలుమూలల నుండి ధోబి తెగకు చెందిన ప్రజలు గాడిదలను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఇక్కడకు వస్తారు. ఇక్కడే వారు ఒకరినొకరు కలుసుకుంటారు. వారి కొడుకులు, కుమార్తెల వివాహం ఇక్కడే జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి తిధి నుంచి మీనా బజార్ ప్రారంభంఅవుతుంది.

సమాంతరంగా పడే సూర్య కిరణాలు

పద్మ పురాణంలో దర్దార క్షేత్ర మహత్యాన్ని వివరించింది. భృగు ప్రాంతం అంటే బల్లియా.. ఘాజీపూర్ లో కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యకిరణాలు భూమిపై అడ్డంగా పడతాయి. అటువంటి పరిస్థితిలో ఈ కిరణాలు గంగా, ఘఘ్రా సంగమం వద్ద నీటితో ఢీకొనడం ద్వారా సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కిరణాలు శరీరం పై పడితే ఆ కిరణాల ప్రభావం వలన రకాల వ్యాధులు మాయమవుతాయి. ముఖ్యంగా మగతనం పెరుగుతుందని నమ్మకం. ఈ నమ్మకం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ స్నాన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు ఉత్తర భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. మత్స్య పురాణం ప్రకారం శరత్ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి మధ్య ఎవరు ఇక్కడ స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కడిగివేయబడతాయని విశ్వాసం.

ప్రపంచవ్యాప్తంగా కీర్తి

కాలక్రమేణా ఈ జాతర వైశాల్యం , ప్రభావం రెండూ తగ్గాయి. మొగలుల కాలంలో జంబూద్వీపమంతా ఈ జాతర చర్చనీయాంశంగా ఉండేది. ఆ రోజుల్లో ఇక్కడ జరిగే జాతరలో ప్రపంచ వాణిజ్యం జరిగేది. ఢాకా నుంచి మస్లిన్, లాహోర్, కరాచీ నుంచి సుగంధ ద్రవ్యాలు, ఇరాన్ నుంచి గుర్రాలు, పంజాబ్, హర్యానా, ఒరిస్సా , నేపాల్ నుంచి గాడిదలు కొనుగోలు, అమ్మకాల కోసం ఇక్కడకు తీసుకువచ్చారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు