AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఒక్క గ్లాస్ ఆరెంజ్ న్యూస్ ఆమె తలరాతను మార్చేసింది..!

ఒక్క క్షణం చాలు అదృష్ట.. దురదృష్టాలకు అని అనేక సంఘటలు నిరుపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ యువతి జీవితాని ఒక చిన్న సంఘటన మార్చేసింది. అదృష్టం తలుపు తట్టడంతో ఆరెంజ్ జ్యూస్ కొనుక్కుని ఏకంగాకోటీశ్వరురాలైంది. ఈ కథ అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన కెల్లీ స్పాహర్ కథ.

Viral News: ఒక్క గ్లాస్ ఆరెంజ్ న్యూస్ ఆమె తలరాతను మార్చేసింది..!
Up Women Kelly Spahr
Surya Kala
|

Updated on: Nov 12, 2024 | 7:04 PM

Share

ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడానికి ఓ మహిళ షాపుకి వెళ్ళింది. అయితే అప్పుడు ఆమెకు తెలియదు అదృష్టం తన వెంట వస్తుందని.. తాను కొన్న జ్యూస్ తోనే ఆ మహిళ కోటీశ్వరురాలైంది. అయితే జ్యూస్ కొంటే మిలియనీర్ ఎలా అవుతారని మీరు ఆశ్చర్యపోతారున్నారా.. విషయమేమిటో తెలుసుకుందాం.. అమెరికాలోని నార్త్ కరోలినా నివాసి కెల్లీ స్పార్ అనే యువతి జీవితాన్ని ఓ చిన్న సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్క క్షణంలో ఆమె కోటీశ్వరురాలైంది.

UPI నివేదిక ప్రకారం కెర్నర్స్‌విల్లేకు చెందిన కెల్లీ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడానికి పైన్ గ్రోవ్ రోడ్‌లోని క్వాలిటీ మార్ట్‌కి వెళ్ళినట్లు.. అక్కడ తనకు అదృష్టం వచ్చిందని చెప్పింది. తన జీవితంలో ఎప్పుడూ లాటరీ టిక్కెట్టు కొనలేదని చెప్పింది. అసలు తాను ఎప్పుడు లాటరీ టికెట్ కొనాలని ఆలోచించలేదని.. అయితే ఆ రోజు తనను లాటరీ కౌంటర్‌ ఆకర్షించిందని చెప్పింది. వెంటనే మల్టిప్లైయర్ స్క్రాచ్ ఆఫ్ టికెట్ $20కి ఖరీదు చేసింది. తర్వాత $2,50,000 (మన దేశ కరెన్సీ లో సుమారు రూ. 2 కోట్లు) జాక్‌పాట్ కొట్టేసింది.

జాక్‌పాట్ తగిలిందని నమ్మని కెల్లీ

ఇవి కూడా చదవండి

జాక్‌పాట్ గెలిచిందని కెల్లీ మొదట్లో నమ్మలేకపోయింది. ఆమె నిజంగా కోట్లు గెలుచుకుందని స్టోర్ మేనేజర్ చెప్పడంతో.. అప్పుడు కెల్లీ ఆనందంతో గెంతడం ప్రారంభించింది. తనకు తగిలిన జాక్‌పాట్ తన జీవితాన్ని మార్చివేసిందని ఆయన అన్నారు. లాటరీలో గెలుచుకున్న డబ్బులు ఆమె కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. ఆర్ధికంగా వెసులుబాటు ఇచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..