AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టి నాగినిలా డ్యాన్స్ చేసిన యువతి.. ఈ పాము ఎంత ప్రమాదకరమో తెలుసా..

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ఇచ్చాధారి నాగిని రొమాన్స్ అని పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ వీడియోలో ఒక యువతి వెండి తెరపై శ్రీదేవి నాగిలా ఎలా డ్యాన్స్ చేసిందో అదే విధంగా ప్రమాదకరమైన నల్ల తాచు పాము (కింగ్ కోబ్రా)ను ముద్దుపెట్టుకుని.. అనంతరం నాగినిలా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.

Viral Video: కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టి నాగినిలా డ్యాన్స్ చేసిన యువతి.. ఈ పాము ఎంత ప్రమాదకరమో తెలుసా..
Viral VideoImage Credit source: Instagram/@lucky_udaan4090
Surya Kala
|

Updated on: Nov 12, 2024 | 6:04 PM

Share

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. దీనిని తాకడం మాట అటుంచండి.. కనీసం దీని దగ్గరకు వెళ్ళడం కూడా ప్రమాదం.. ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. అందుకనే ఈ నల్ల తాచు పాముకి మనుషులే కాదు జంతువులు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మడం కష్టం. ఎందుకంటే వైరల్ వీడియోలో ఒక యువతి కింగ్ కోబ్రా దగ్గర పడుకుని వింతగా డ్యాన్స్ చేయడమే కాదు.. ఎలాంటి భయం లేకుండా పాము పడగను తన నాలికతో ముద్దు పెట్టుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ యువతి ఇచ్చాధారిని నాగిని అంటూ కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి నాగు పాము పడగ మీద నాలికతో ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. మరుక్షణం ఆ నాగుపాము తలని వెనక్కి తిప్పి ఆ యువతిని చూడటం ప్రారంభించింది. తన వైపు చూస్తున్న కింగ్ కోబ్రా దగ్గర ఆ యువతి నాగినా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వీడియోలో మహిళ తన నాలుకని ఆడిస్తూ ఆ నల్ల తాచు తనవైపు వచ్చేలా పదే పదే చేస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఎక్కడిది.. ఈ వీడియో ఎక్కడిది అనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేదు. అయితే కొంత మంది నెటిజన్లు ఈ వీడియో రాజస్థాన్‌లోని నాగౌర్‌కి చెబుతున్నారు. ఈ వీడియోలో ఉన్న యువతి స్వయంగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లక్కీ_udaan4090లో షేర్ చేసింది. ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా లైక్ చేశారు. అయితే ఎక్కువ మంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

కింగ్ కోబ్రా దగ్గరయువతి నాగిని డ్యాన్స్

పాములతో ఇలాంటి ప్రమాదకరమైన రీతిలో ప్రవర్తించడం సరి కదాని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించ వద్దని ఒక వినియోగదారు రాశారు. ఇది మూర్ఖత్వం అని అంటున్నారు. అదే సమయంలో, వన్యప్రాణులను గౌరవించండి అని మరొకరు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీవులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కామెంట్ చేయగా.. ఆమె అసలు ఇచ్చాధారిని నాగిని అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

నల్ల తాచు లక్షణలు ఏమిటంటే

నల్ల తాచు పాము అత్యంత ప్రమాదకరమైన పాము. ఈ కింగ్ కోబ్రా పొడవు 18.8 అడుగుల (5.7 మీటర్లు) వరకు ఉంటుంది. ఈ నాగుపాము మెడ పక్కటెముకలను విస్తరిస్తుంది.. అందుకనే దీని పడగ పెద్దదిగా ఉంటుంది. ఎవరినైనా భయపెట్టాలంటే తన పడగను విప్పుతుంది. ఈ పాము విషం చాలా శక్తివంతమైనది. కాటు వేసిన 45 నిమిషాల్లో మరణిస్తాడు. ఈ పాము ఒకేసారి 600 మి.గ్రా విషాన్ని విడుదల చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..