Dev Deepavali: ఈ రోజు సాయంత్రం చేసే తులసి పూజ, పిండి దీపం, దీప దానం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున సకల  దేవతలు భూమిపై తిరుగుతారని విశ్వాసం. ఈ రోజున విష్ణు, లక్ష్మి దేవిని పూర్ణ క్రతువులతో పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు సాయంత్రం చేసే కొన్ని చర్యలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం? జీవితంలోని సమస్యలను అధిగమించడానికి  దేవ్ దీపావళి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి.

Dev Deepavali: ఈ రోజు సాయంత్రం చేసే తులసి పూజ, పిండి దీపం, దీప దానం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Dev Deepavali
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2023 | 5:19 PM

కార్తీక మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే ఈరోజు దేవ్ దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం  ఈ రోజున విష్ణువు మత్స్య అవతారం ధరించి భూమిదేవిని కష్టం నుంచి  రక్షించాడు. అంతేకాదు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడినిసంహరించారు. కనుక కార్తీక పౌర్ణమి రోజున దేవతలు దేవ్ దీపావళి జరుపుకున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున సకల  దేవతలు భూమిపై తిరుగుతారని విశ్వాసం. ఈ రోజున విష్ణు, లక్ష్మి దేవిని పూర్ణ క్రతువులతో పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు సాయంత్రం చేసే కొన్ని చర్యలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం?

జీవితంలోని సమస్యలను అధిగమించడానికి  దేవ్ దీపావళి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ఒకటి శివకేశవులకు సంబంధించిన కథలు వినడం. దేవ్ దీపావళి రోజున సత్యనారాయణుని కథను వినడం లేదా వ్రతం చేయడం.. దీనివల్ల కష్టాలు నశించి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవ్ దీపావళి రోజున పిండి దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన అర్దిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం.

దీప దానం

హిందూ మత విశ్వాసాల ప్రకారం, దేవ్ దీపావళి రోజున దీపం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున దీపదానం చేయడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు. దీపావళి రోజున నదీ తీరంలో లేదా ఆలయంలో పిండి దీపం వెలిగించి ఆ దీపదానం చేయాలని నమ్మకం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగుతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

తులసిని పూజించండి

దేవ్ దీపావళి రోజున తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం. తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైనదని. అంతేకాదు తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే తులసి పూజ చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అంతేకాదు వ్యాపార, ఉద్యోగాలలో కూడా పురోగతి సాధిస్తారు.

ఇంట్లో దీపాలను వెలిగించడం వలన

దీపావళి మాదిరిగానే దేవ్ దీపావళి రోజున కూడా ఇంట్లో నువ్వులతో దీపాలను వెలిగించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణానలను కట్టి.. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో అలంకరించాలి. ఇలా చేయడం వలన లక్ష్మి దేవి ఆశీర్వాదాన్ని అందిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?