Karthika Masam: నేటి నుంచి శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి..

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలు, కార్తీక దీపారాధనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు.
సోమారామంకు పోటెత్తిన భక్తులు.. కార్తీక మాసం ప్రారంభంకావడంతో తెలుగు రాష్ట్రాల్లో ని పంచారామ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రముఖ పంచారామక్షేత్రం సోమారామంకు భక్తుల పోటెత్తారు. కార్తీక మాసం తొలిరోజు కావడంతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వరస్వామి ముదురు గోధుమ వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడి సోమేశ్వరుడు ప్రతి అమావాస్య కు గోధుమ వర్ణంలోనూ , పౌర్ణమికి శ్వేత వర్ణంలోనూ భక్తులకు దర్శనం ఇస్తోన్న సంగతి తెలిసిందే.
Also read: