AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthari Dosha: జాతకాల్లో కర్తరీ దోషం.. ఆనందాలకు ఇదొక అడ్డుగోడ.. పరిహారమేంటో తెలుసా..?

Karthari Dosha in Astrology: కర్తరీ దోషం ఉన్నవారి జీవితంలో ఎదుగుదల ఆలస్యం, మానసిక ఒత్తిడి, అడ్డంకులు వంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతారు. ఒక జాతకంలో ఏదైనా ఇంటి ఎడమ, కుడి వైపున సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఉంటే.. అది పాప కర్తరీ దోషాన్ని సూచిస్తుంది.

Karthari Dosha: జాతకాల్లో కర్తరీ దోషం.. ఆనందాలకు ఇదొక అడ్డుగోడ.. పరిహారమేంటో తెలుసా..?
Kartari Dosha
Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 1:53 PM

Share

భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనిషి జీవితం కర్మ, గ్రహ గతి, ఆత్మ వికాసం అనే మూడు స్థంభాలపై నడుస్తుందనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో తరచుగా వినిపించే ఒక ముఖ్యమైన జ్యోతిష పదం “కర్తరీ దోషం”. ఈ దోషం ఉన్నవారి జీవితంలో ఎదుగుదల ఆలస్యం, మానసిక ఒత్తిడి, అడ్డంకులు వంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతారు. ఒక జాతకంలో ఏదైనా ఇంటి ఎడమ, కుడి వైపున సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఉంటే.. అది పాప కర్తరీ దోషాన్ని సూచిస్తుంది. అయితే ఆధ్యాత్మిక దృష్టిలో ఈ దోషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇది శాపమా, లేక ఒక ఆత్మపాఠమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కర్తరీ దోషం అంటే ఏమిటి?

జాతకంలో ఏదైనా భావం లేదా లగ్నం రెండు వైపులా పాపగ్రహాలు (శని, రాహు, కేతు, కుజుడు మొదలైనవి) ఉండినప్పుడు ఏర్పడే స్థితిని కర్తరీ దోషం అంటారు. ‘కత్తెర’లా గ్రహాలు ఆ భావాన్ని నొక్కిపెట్టడం వల్ల ఆ రంగానికి సంబంధించిన ఫలితాలు పూర్తిగా వ్యక్తం కావు. కాగా, మీ జాతకంలో పాప కర్తరి యోగంతో ఏ పని ముందుకు సాగదు. అదే శుభ కర్తరి యోగం ఉంటే మాత్రం మీకు అన్ని సానుకూల ఫలితాలు పొందుతారు.

ఆధ్యాత్మికంగా చూస్తే, కర్తరీ దోషం అనేది శిక్ష కంటే కర్మ స్మరణ. గత జన్మలలో పూర్తి చేయని బాధ్యతలు, ఇతరులకు కలిగించిన బాధలు లేదా స్వార్థపూరిత చర్యలు ఈ జన్మలో అడ్డంకుల రూపంలో ఎదురవుతాయని భావన ఉంది. ఈ దోషం మనిషిని ఆగి ఆలోచించమని, అంతర్ముఖంగా చూడమని సూచిస్తుంది.

జీవితంపై ప్రభావం

ఈ దోషం ఉన్నవారిలో.. కష్టపడి పనిచేసినా ఫలితం ఆలస్యంగా రావడం, ఆత్మవిశ్వాసం తగ్గడం, సంబంధాలలో అపార్థాలు, ఆర్థిక లేదా వృత్తి స్థిరత్వం ఆలస్యం వంటి అంశాలు కనిపిస్తాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో, ఈ వ్యక్తుల్లో అంతర్ముఖత, ధ్యాన ఆసక్తి, ఆధ్యాత్మిక వెతుకులాట ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంటారు.

పాప కర్తరీ దోషం: ఒక గ్రహం లేదా భావం (ఇల్లు) రెండు వైపులా పాప గ్రహాలైన శని, రాహువు, కేతువు లేదా సూర్యుడు ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. కత్తెరతో కట్ చేసినట్లుగా ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు తగ్గిపోతాయని నమ్ముతారు.

శుభ కర్తరీ యోగం: ఒక గ్రహం లేదా భావం రెండు వైపులా శుభ గ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది ఆ భావానికి అదనపు బలాన్ని, సానుకూల ఫలితాలను ఇస్తుంది.

కర్తరీ కాలం (వాస్తు కర్తరి)

ప్రతి సంవత్సరం సూర్యుడు భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాల మధ్య ప్రయాణించే సమయాన్ని “కర్తరి కాలం” అంటారు. డొల్లు కర్తరి ప్రారంభం: ఏప్రిల్ 27, 2026 (సూర్యుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు). డొల్లు కర్తరి.. సూర్యుడు భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది. నిజ కర్తరి (అగ్ని నక్షత్రం) ప్రారంభం: మే 11, 2026 (సూర్యుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు). నిజ కర్తరి (అగ్ని నక్షత్రం) ప్రారంభం: మే 11, 2026 (సూర్యుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు). నిజ కర్తరి.. సూర్యుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో సూర్యుని వేడి తీవ్రంగా ఉంటుందని, కాబట్టి నూతన గృహారంభం, శంకుస్థాపన, వాస్తు సంబంధిత పనులు, ఇతర ముఖ్యమైన శుభకార్యాలు నిర్వహించకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తారు. కర్తరి ముగింపు: మే 25, 2026 (సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిరలోకి మారే ముందు).

పరిహారాలు:

కర్తరి కాలంలో సమస్యల నుంచి ఉపశమనం కోసం సూర్య ఆరాధన చేయడం లేదా సూర్య అష్టోత్తరం పఠించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూజలు, జపాలు, హోమాలు సహాయకారిగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కానీ, ఆధ్యాత్మిక దృష్టిలో అసలైన పరిష్కారం.. క్షమాభావం, సేవా దృక్పథం, అహంకార నివృత్తి, నిస్వార్థ కర్మ వంటి గుణాల పెంపకంలోనే ఉందని సాధువులు అంటున్నారు. ముఖ్యంగా శని, రాహు సంబంధిత దోషాలకు పేదల సేవ, వృద్ధుల సంరక్షణ, మౌన సాధన వంటి మార్గాలు సూచిస్తారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

జాతకాల్లో కర్తరీ దోషం.. ఆనందాలకు ఇదొక అడ్డుగోడ.. పరిహారమేంటి..?
జాతకాల్లో కర్తరీ దోషం.. ఆనందాలకు ఇదొక అడ్డుగోడ.. పరిహారమేంటి..?
ఈ వస్తువులపై సుంకాలు తగ్గింపు.. బడ్జెట్‌లో ఊరట
ఈ వస్తువులపై సుంకాలు తగ్గింపు.. బడ్జెట్‌లో ఊరట
మటన్‌లోని ఈ పార్ట్ తినండి చాలు.. మస్త్ మజా ఇస్తదంతే..
మటన్‌లోని ఈ పార్ట్ తినండి చాలు.. మస్త్ మజా ఇస్తదంతే..
మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి..
మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి..
టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..