Kanipakam: కాణిపాకం వినాయకుడి ఆలయ ప్రధాన అర్చకుడు సస్పెండ్.. వెలుగులోకి సోమశేఖర్ నిర్వాకం..

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. వర సిద్ది వినాయకుడి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ పై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. అర్హత లేనిదే ప్రధాన అర్చకుడిగా నియమించారనే పలు ఆరోపణలు.. పలు ఫిర్యాదుల నేపధ్యంలో విచారణ చేపట్టిన దేవస్థానం అధికారులు సోమ శేఖర్ ని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ సోమ శేఖర్ పై క్షుద్ర పూజలు చేస్తున్నారని, వెండి ఆభరణాలు గోల్ మాల్ అయ్యాయనే ఆరోపణలు వినిపించాయి.

Kanipakam: కాణిపాకం వినాయకుడి ఆలయ ప్రధాన అర్చకుడు సస్పెండ్.. వెలుగులోకి సోమశేఖర్ నిర్వాకం..
Kanipakam Vinayaka Temple
Follow us

| Edited By: Surya Kala

Updated on: Oct 30, 2024 | 11:17 AM

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. వెయ్యిళ్ల చరిత్ర ఉన్న ఆలయ ప్రధాన అర్చకుడి నియామకం పై పలు ఫిర్యాదులతో విచారణ నిర్వహించిన దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాణిపాకం ఆలయ ఇంచార్జ్ ప్రధాన అర్చకులుగా గణేష్ గురుకుల్ ను నియమించిన ఈఓ గురు ప్రసాద్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందేందుకు తప్పుడు సర్టిఫికెట్లు దేవస్థానానికి సమర్పించడంతో సోమశేఖర్ గురుకులపై వేటు వేశారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు ప్రధాన అర్చకుడిపై వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వారం రోజులపాటు జరిగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి ఈఓ నివేదిక సమర్పించారు.

గతంలో కాణిపాకం ఆలయానికి అనుబందంగా ఉన్న మణికంఠేశ్వరాలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన సోమశేఖర్ గురుకుల్ గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో సోమశేఖర్ గురుకుల్ క్షుద్ర పూజలు చేసేవారని ఆలయంలో పనిచేసే ఆరని భాగ్యజ్యోతి అనే మహిళ సైతం ఫిర్యాదు చేసింది. తన ఆరోగ్యం క్షీణించడానికి కారణం సోమశేఖర్ గురుకుల్ అని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈఓ కార్యాలయం ముందు గతంలో ధర్నా కూడా చేసింది ఆరని భాగ్యజ్యోతి. మరకతాంబిక సమేత మణికంఠేశ్వరాలయంలో వెండి ఆభరణాలు గోల్ మాల్ అయ్యాయని గతంలో చిత్తూరుకు చెందిన విజయలక్ష్మి అనే భక్తురాలు కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులు విచారణ దశలో ఉండగా ప్రధాన అర్చకుడిగా అర్హత లేకపోయినా గత పాలకమండలి సోమశేఖర్ గురుకుల్ కు పదోన్నతి కల్పించిందని దేవాదాయ శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎట్టకేలకు ప్రధాన అర్చకుడిగా ఉన్న సోమశేఖర్ గురుకులను తప్పిస్తూ ఈఓ ఆదేశం జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..