AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకాల మరణం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా.. ఈ రోజు సాయంత్రం యమ దీపాన్ని ఇలా వెలిగించండి..

ఈరోజు దీపావళి ఐదు రోజుల దీపాల పండుగలో రెండవ రోజు. ఈ రోజు అంటే అక్టోబర్ 30న ఛోటీ దీపావళి లేదా నరక చతుర్దశిగా జరుపుకుంటున్నారు. నరక చతుర్దశి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అకాల మరణం నుండి విముక్తి పొందవచ్చు. ఛోటీ దీపావళి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

అకాల మరణం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా.. ఈ రోజు సాయంత్రం యమ దీపాన్ని ఇలా వెలిగించండి..
Naraka Chaturdashi 2024
Surya Kala
|

Updated on: Oct 30, 2024 | 10:53 AM

Share

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలోని చతుర్దశి తిథి రోజున (ఛోటీ దీపావళి) నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈరోజు అంటే అక్టోబర్ 30న ఛోటీ దీపావళి జరుపుకుంటున్నారు. ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఛోటీ దీపావళి రోజున లక్ష్మీదేవి, కుబేరుడులతో పాటు మృత్యుదేవత యమ ధర్మ రాజులను పూజించే సంప్రదాయం ఉంది. ఎవరైనా సరే పితృ దోషం లేదా అకాల మరణం నుంచి బయటపడాలనుకుంటే ఈ రోజున కొన్ని సులభమైన చర్యలు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం నరక చతుర్దశి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా అకాల మరణ భయం నుండి బయటపడవచ్చు. యమ ధర్మ రాజు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో నరక చతుర్దశి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఛోటీ దీపావళికి శుభ సమయం

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:52 గంటలకు ముగుస్తుంది. ఛోటీ దీపావళి రోజున అక్టోబరు 30న సాయంత్రం 4:36 నుంచి 6:15 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయం .

ఇవి కూడా చదవండి

ఈ రోజు ఎవరిని పూజిస్తారంటే

మత సంప్రదాయాల ప్రకారం ఈ రోజున యమ ధర్మ రాజును పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున యముడి పేరుతో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. నరక చతుర్దశి రోజున యముడిని పూజించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని నమ్మకం. అలాగే సాయంత్రం సమయంలో దీపదానం చేయడం వల్ల నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ఛోటీ దీపావళి రోజున ఏం చేయాలంటే

ఛోటీ దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేచి శ్రీకృష్ణుడు, హనుమంతుడిని, యమధర్మ రాజుతో పాటు కాళికాదేవిని పూజించాలి. నరక చతుర్దశి రోజున ఈశాన్య దిశకు అభిముఖంగా పూజ చేయాలి. ఛోటీ దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం ఎడమ వైపున ధాన్యం లేదా బియ్యం పోసి.. దానిపై నువ్వుల నూనెతో ఒకవైపు దీపం వెలిగించండి. దీపం జ్వాల దక్షిణం వైపు ఉండాలని గుర్తుంచుకోండి.

ఛోటీ దీపావళి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

  1. నరక చతుర్దశి అంటే ఛోటీ దీపావళి రోజున దీపాలను దానం చేయండి.
  2. ఛోటీ దీపావళి రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ యముడి పేరుతో దీపం వెలిగించాలి.
  3. దీపంలో నాలుగు ఒత్తులు వేసి నాలుగు వైపులా దీపం వెలిగేలా చేసి ఆ దీపాన్ని ఇంటి అంతటా తిప్పాలి.
  4. దీని తరువాత ఇంటి వెలుపల దక్షిణ దిశలో ఆ దీపాన్ని దూరంగా ఉంచండి.
  5. ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఇంటి లోపల ఉండాలని.. ఈ యమ దీపాన్ని చూడకూడదని గుర్తుంచుకోండి.

ఛోటీ దీపావళి రోజున ఏమి చేయకూడదంటే

  1. నరక చతుర్దశి రోజున ఇంటి దక్షిణ దిశను మురికిగా ఉంచరాదు
  2. అలా చేయడం వల్ల పూర్వీకులకు, యమ ధర్మరాజుకు కోపం వస్తుందని నమ్ముతారు.
  3. ఛోటీ దీపావళి రోజు నువ్వుల నూనె దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని నమ్మకం.
  4. నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళి రోజున పొరపాటున కూడా చీపురు కొనరాదు
  5. ఛోటీ దీపావళి రోజు చీపురు నిటారుగా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో ఉండదని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)