AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను అస్సలు విస్మరించవద్దు..!

Children Health: చిన్నపిల్లలు తమ శారీరక అసౌకర్యాలను సరిగా వివరించలేకపోవడం వల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సరైన సమయంలో గుర్తించకపోతే, సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి గుండె జబ్బుల హెచ్చరిక కావచ్చని అంటున్నారు.

గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను అస్సలు విస్మరించవద్దు..!
Child Health
Rajashekher G
|

Updated on: Feb 19, 2026 | 10:14 AM

Share

నేటి జీవనశైలిలో గుండె సంబంధిత సమస్యలు పెద్దలకే కాకుండా పిల్లలలో కూడా పెరుగుతున్నాయి. పెద్దలలో గుండె జబ్బుల లక్షణాలు స్పష్టంగా కనిపించవచ్చు. కానీ పిల్లలలో ఇవి చాలా సార్లు నిశ్శబ్దంగా, గుర్తించడానికి కష్టంగా ఉంటాయి. చిన్నపిల్లలు తమ శారీరక అసౌకర్యాలను సరిగా వివరించలేకపోవడం వల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సరైన సమయంలో గుర్తించకపోతే, సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి గుండె జబ్బుల హెచ్చరిక కావచ్చని అంటున్నారు. ఇప్పుడు వైద్య నిపుణుల సూచనల గురించి తెలుసుకుందాం.

పిల్లల్లో గుండె జబ్బుల హెచ్చరిక సంకేతాలు

1. ఆడేటప్పుడు ఊపిరి ఆడకపోవడం

పిల్లలు ఇతర పిల్లలతో ఆడుకునేటప్పుడు లేదా కొద్దిగా పరిగెత్తినప్పుడే ఎక్కువగా అలసిపోవడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాల్సిన విషయం. మెట్లు ఎక్కేటప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి.

2. సరిగా తినకపోవడం, బరువు పెరగకపోవడం

పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, తరచూ ఆహారం పట్ల విరక్తి చూపడం, పాలిచ్చేటప్పుడు త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు గుండె సమస్యల సంకేతాలు కావచ్చు.

3. అధికంగా చెమటలు పడటం

సాధారణ వాతావరణంలోనే, ముఖ్యంగా పాలు లాంటి పానీయాలు తాగేటప్పుడు లేదా ఆహారం తినేటప్పుడు ఎక్కువగా చెమటలు పడటం గుండెపై అధిక ఒత్తిడి ఉందనే సూచన కావచ్చు.

4. ఎప్పుడూ అలసటగా ఉండటం

ఇతర పిల్లల మాదిరిగా చురుకుగా ఉండాల్సిన వయసులోనే పిల్లలు ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించడం, ఆడటానికి ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

5. పెదవులు లేదా గోళ్లు నీలంగా మారడం

ఏడుస్తున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు పెదవులు, గోళ్లు కొద్దిగా నీలం రంగులోకి మారడం ఆక్సిజన్ లోపానికి సంకేతం. ఇది గంభీరమైన లక్షణం కావచ్చు.

తల్లిదండ్రులు చేయాల్సినది ఏంటి?

మీ బిడ్డ ప్రవర్తనలో చిన్న మార్పులనైనా గమనించండి. తరచూ అలసట, శ్వాసలో ఇబ్బంది, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. పుట్టుకతో వచ్చే గుండె లోపాలు (Congenital Heart Defects) ముందుగానే గుర్తిస్తే, శస్త్రచికిత్స లేదా మందుల ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చు లేదా నయం చేయవచ్చు.

పిల్లల ఆరోగ్యం విషయంలో “ఇది చిన్న విషయం” అని భావించి వదిలేయడం మంచిది కాదు. చిన్న లక్షణమే పెద్ద సమస్యకు ప్రారంభ సూచన కావచ్చు. సరైన సమయంలో జాగ్రత్త పడితే, మీ బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చు. తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల ఆరోగ్య రక్షణకు మొదటి అడుగు అని గుర్తుంచుకోవాలి.

Follow Us
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. లైవ్ వీడియో
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. లైవ్ వీడియో
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..
బరువు తగ్గడానికి, రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో జొన్న జావ సిద్ధం
బరువు తగ్గడానికి, రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో జొన్న జావ సిద్ధం