AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుట్టూరా బూడిద ఉందని మొహం చిట్లిచ్చకండి.. లోపల ఉంది నిజంగా అమృతమే..

ఊర్లల్లో ఎక్కడపడితే అక్కడ లభించే అద్భుతమైన ఔషధం బూడిద గుమ్మడికాయ.. అవును.. బూడిద గుమ్మడికాయ, కేవలం ఇంటి ముందు దిష్టి తీయడానికి లేదా వంటల్లో మాత్రమే కాకుండా, జ్యూస్ రూపంలో తీసుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

చుట్టూరా బూడిద ఉందని మొహం చిట్లిచ్చకండి.. లోపల ఉంది నిజంగా అమృతమే..
Health Benefits Of Ash Gourd
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2026 | 3:11 PM

Share

ఊర్లల్లో ఎక్కడపడితే అక్కడ లభించే అద్భుతమైన ఔషధం బూడిద గుమ్మడికాయ.. అవును.. బూడిద గుమ్మడికాయ, కేవలం ఇంటి ముందు దిష్టి తీయడానికి లేదా వంటల్లో మాత్రమే కాకుండా, జ్యూస్ రూపంలో తీసుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో దాగి ఉన్న అనేక ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు. సరైన పద్ధతిలో తయారు చేసి తీసుకుంటే, ఇది మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

గుమ్మడికాయ విటమిన్ A, C, పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లతో నిండిన అత్యంత పోషకమైన కూరగాయ.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే.. ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ కోసం 2 కిలోల నుండి 4 కిలోల బరువు గల మీడియం సైజు కాయలను ఎంచుకోవడం మంచిది. జ్యూస్ చేయడానికి ముందు, కాయ మీద ఉండే తెల్లని బూడిదను పూర్తిగా పోయే వరకు శుభ్రం చేసి.. ఉపయోగించాలి.

బూడిద గుమ్మడి జ్యూస్ ప్రయోజనాలు:

బూడిద గుమ్మడి జ్యూస్ అనేక ఆరోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తుంది.

  • బూడిద గుమ్మడి శరీరంలోని రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.
  • కడుపునొప్పి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ప్రేగులను శుభ్రపరిచి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
  • గుండె ఆరోగ్యం: రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి బలాన్ని చేకూరుస్తుంది.
  • గుమ్మడి కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
  • బూడిద గుమ్మడికాయ అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • గుమ్మడిలో ఉండే విటమిన్-ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది.
  • బాడీని డిటాక్స్ చేయడంలో గుమ్మడికాయ ప్రభావవంతంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
  • బూడిద గుమ్మడికాయలో 96% నీరు, అధిక పీచుపదార్థం, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరం. ఒక గ్లాసు జ్యూస్ తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించి, చిరుతిండ్ల వైపు మనసు మళ్లదు, అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
  • బూడిద గుమ్మడికాయ యాంటీ-క్యాన్సర్‌గా కూడా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.
  • యాసిడిటీని నియంత్రించి, శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • ఆందోళన చెందేవారు తరచూ ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • పిల్లలలో జ్ఞాపకశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

జ్యూస్ తయారీ విధానం:

బూడిద గుమ్మడికాయను జ్యూస్ చేసేటప్పుడు తొక్క, గుజ్జు, గింజలను తీయకూడదు. ఎందుకంటే వీటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాయను శుభ్రం చేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.

జూసర్ ఉంటే, కట్ చేసిన ముక్కలను నేరుగా జూసర్‌లో వేసి జ్యూస్ చేసుకోవచ్చు. వడకట్టాల్సిన అవసరం ఉండదు.

మిక్సీలో చేసేట్లయితే, ముక్కలను వీలైనంత చిన్నవిగా కట్ చేసి, కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను వడకట్టుకుని జ్యూస్ తీసుకోవాలి.

ఎప్పుడు, ఎలా తాగాలి:

పరగడుపున తాగడం ఉత్తమం. జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. అప్పుడే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ జ్యూస్ తాగవచ్చు.మొదట తక్కువ మోతాదుతో అలవాటు చేసుకోవడం మంచిది. సాధ్యమైనంతమేరకు.. స్వచ్ఛమైన జ్యూస్ తాగడం ఉత్తమం. అయితే తాగలేని వారు ఒక స్పూన్ తేనె లేదా ఒక చెక్క నిమ్మరసం కలుపుకోవచ్చు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. గుమ్మడి జ్యూస్ ను తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us