Tirumala: వెంకన్న దర్శనం విషయంలో స్వామీజీలు అలక.. అడిషనల్ ఈవో వర్సెస్ స్వామీజీలు

శ్రీవారి దర్శనం విషయంలో ఇప్పుడు టీటీడీ వర్సెస్ స్వామీజీలుగా వ్యవహారం మారింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసనంద సరస్వతి వర్సెస్ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి మధ్య వార్ నెలకొంది. తిరుపతికి వచ్చిన సాధువులకు స్వామీజీలకు మాతాజీలకు దర్శనం అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిని తోసి పుచ్చడం వివాదానికి కారణం అయ్యింది. అడిగినన్ని దర్శనం టికెట్లు ఇవ్వాలని స్వామీజీలు, రద్దీ దృష్ట్యా అందరికీ దర్శనం కల్పించలేమని టీటీడీ తేల్చి వేయడంతో వ్యవహారం రచ్చగా మారింది.

Tirumala: వెంకన్న దర్శనం విషయంలో స్వామీజీలు అలక.. అడిషనల్ ఈవో వర్సెస్ స్వామీజీలు
Ttd Responds To Swamiji’s Claims
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Oct 30, 2024 | 11:59 AM

తిరుమల వెంకన్న క్షేత్రంలో స్వామీజీలకు శ్రీవారి దర్శన భాగ్యం కలగక పోవడం మరో వివాదంగా మారింది. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న తిరుపతిలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన స్వామీజీలు శ్రీవారి దర్శనం చేసుకోకుండానే వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు స్వామీజీలు, టీటీడీ అదనపు ఈఓ మధ్య వివాదంగా నిలిచింది. ఈ నెల 26 న తిరుపతిలో జరిగిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో పాల్గొన్న స్వామీజీలు పలు డిమాండ్లను తెరమీదకి తెచ్చారు.

భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతి పవిత్రతను మరింత పెంచాలన్న వాదన వినిపించిన స్వామీజీలు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన స్వామీజీలు మాతాజీలు పాల్గొన్న ధార్మిక సదస్సు పలు తీర్మానాలను చేశారు. తిరుపతిలో మద్యం మాంసం అమ్మకాలు లేకుండా చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు టీటీడీ వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. వందలాదిగా వచ్చిన సాధుసంపత్తులు ధార్మిక సదస్సు అనంతరం 27 న శ్రీవారిని దర్శించుకోవాలనుకున్తున్నట్లు టీటీడీని కోరారు. సదస్సు నిర్వహించిన ఏపీ సాగు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఈ మేరకు టీటీడీ అధికారులను 10 రోజుల ముందుగానే కలిశారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న స్వామీజీలకు వారి శిష్యులకు 600 మందికి వసతితో పాటు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు. అయితే టీటీడీ ఇందుకు నిరాకరించిందంటూ మీడియా ముందుకు వచ్చిన స్వామీజీలు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరును తప్పు పట్టారు. కనీసం మర్యాద కూడా అదనపు ఈవో కార్యాలయంలో స్వామీజీలకు లభించలేదని వాపోయారు. తిరుమలలో కార్పొరేట్ కంపెనీలకు అర్హత లేని వ్యక్తులకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్న అదనపు ఈవో స్వామీజీలను కించపరిచేలా వ్యవహరించారని ఆరోపించారు స్వామీజీలు. అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి.

ఇవి కూడా చదవండి

అధికారులపై స్వామీజీ ఆరోపణలు సరికాదంటోన్న టీటీడీ

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది. అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని తద్వారా మమ్మల్ని అవమానించారని ఆరోపించడం వాస్తవం కాదని ప్రకటన విడుదల చేసింది. 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని శ్రీనివాసానంద సరస్వతి టీటీడీ అధికారులను కోరారని పేర్కొంది. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించామని, తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని అద‌న‌పు ఈవో చెప్పారని ప్రకటనలో పేర్కొంది. శ్రీనివాసనంద సరస్వతి 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టారని.. అడిగినంత‌మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌న్న కోపంతోనే టీటీడీ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ అంటోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి