Gulab Jamun Recipe: దీపావళి వేళ.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే గులాబ్ జామున్.. పాల పొడితో తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ
దీపావళి పండగ కోసం ఆంధ్రప్రదేశ్ లో అరిసెలు, మినప సున్ని వంటి స్వీట్స్ కు తయారు చేస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు దీపావళి పండగ వస్తే చాలు సింపుల్ గా రెడీ చేసుకునే గులాబ్ జామున్ తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు పాల పొడితో గులాబ్ జామున్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే పండగ దీపావళి. దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు, టపాకాయ చప్పుళ్ళు మాత్రమే కాదు నోరూరించే రకరకాల ఆహార పదార్ధాలు. ముఖ్యంగా దీపావళికి స్వీట్ తినే సంప్రదాయం చాలా ప్రాంతాలల్లో ఉంది. ఇప్పటికీ దీపావళి పండగ కోసం ఆంధ్రప్రదేశ్ లో అరిసెలు, మినప సున్ని వంటి స్వీట్స్ కు తయారు చేస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు దీపావళి పండగ వస్తే చాలు సింపుల్ గా రెడీ చేసుకునే గులాబ్ జామున్ తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు పాల పొడితో గులాబ్ జామున్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
పాల పొడి -ఒక కప్పు ఆల్ పర్పస్ పౌడర్ – పావు కప్పు నెయ్యి లేదా వెన్న -పావు కప్పు బేకింగ్ షోడా – అర టీ స్పూన్ పాలు లేదా నీరు -అర కప్పు నూనే – వేయించడానికి సరిపడా చక్కర – ఒక కప్పు నీరు – ఒక కప్పు రోజ వాటర్ – ఒక టీ స్పూన్ యాలకుల పొడి – చిటికెడు
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని పాల పొడి, ఆల్ పర్పస్ పౌడర్ , నెయ్యి తో పాటు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఇప్పుడు పాలను పొస్తూ మెత్తగా చపాతీ పిండిలా కలపండి. ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేలా కలిపి.. దాని మీద ఒక క్లాత్ వేసి పక్కకు పెట్టండి. కొంచెం సమయం తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ గా స్మూత్ గా చుట్టుకొండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనే పోసుకుని వేడి చేయండి. నూనే వేడి ఎక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ ను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకూ వేయించండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో చక్కర, నీరు పోసి సిరప్ ని తయారు చేసుకోండి. ఈ సిరప్ లో కొంచెం రోజ్ వాటర్, యాలకుల పొడిని వేసి చక్కర కరిగే వరకూ వేడి చేయండి. ఇప్పుడు ఈ సిరప్ లో వేయించిన బాల్స్ వేసి ఒక అర గంట నానబెట్టాలి. అంతే రుచికరమైన గులాబ్ జామున్ రెడీ..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..